Selena Gomez: My Mind & Me - తెలుగు

రోగుల జీవితాల్లో ఇంకాస్త పాలు పంచుకోగలిగితే, వాళ్లకి సాయపడినవాడిని అవుతానని అనిపిస్తోంది.

అది చాలా అనైతికమైన పనిలా అనిపిస్తోంది.

నీ భర్త మానసికంగా నిన్ను బాధపెడుతున్నాడు. వాడిని వదిలేయ్.

అలాగే.

స్క్రబ్స్, టెడ్ లాసోల ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్, బిల్ లారెన్స్ నుండి

-నీ గురించి నాకు ఆందోళనగా ఉంది. -[జిమ్మీ] ఆమెని ఇంకా నేను మర్చిపోలేదు.

[ఏడుస్తున్నాడు]

పిచ్చిగా ప్రవర్తిస్తున్నావు.

జేసన్ సెగెల్

[పాల్] నీ దుఃఖంలో మునిగి కొట్టుకుపోతావో,

లేదా దాన్ని అధిగమించి…

హారిసన్ ఫోర్డ్

-…బయట పడతావో తేల్చుకో. -ఏదైనా జరగవచ్చు.

ఇక్కడి నుండి బయటకు వెళ్లిపో.

2019 పారిస్

[గోమెజ్ మూలుగుతూ, శ్వాస పీలుస్తోంది]

[ఫ్రెండ్] ఇప్పుడు ఎలా అనిపిస్తోంది?

[గోమెజ్] నేను బాగా అలసిపోయాను.

[ఫ్రెండ్] ఉదయం పూట తీసుకోవలసిన మందులు కావాలా?

[గోమెజ్] హమ్.

[ఫ్రెండ్] నీ జవాబు నాకు తెలుసు, కానీ… నువ్వు వేసుకోవాలి.

-[కెమెరా షట్టర్స్ క్లిక్ అవుతున్నాయి] -[మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్నారు] మార్నింగ్, సెలీనా.

[గోమెజ్] ఒక హామీ ఇస్తాను.

నా చీకటి రహస్యాలను మాత్రమే మీకు చెబుతాను.

డిసెంబర్ 19.

నేను ఇలా బతకడం మానేయాలి.

నేను ఎందుకు వెలుగుకి ఇంత దూరం అయిపోయాను?

నేను కోరుకున్న ప్రతీది నేను సాధించాను, ఇంకా కావాలనుకున్న ప్రతీదీ పొందాను,

కానీ అది నన్ను చంపేసింది.

ఎందుకంటే ఎప్పుడూ సెలీనానే ఉంటుంది.

-[రిపోర్టర్లు అరుస్తున్నారు] సెలీనా! -[అభిమానుల కేరింతలు]

[ప్రేక్షకుల కేకలు]

స్పోర్ట్స్ ఎరీనా సౌత్

[మొదటి టీవీ రిపోర్టర్] సెలీనా గోమెజ్, పాడిన సింగిల్ పాట, “గుడ్ ఫర్ యూ,”

విమర్శకుల్ని మెప్పించి కమర్షియల్ సక్సెస్ సాధించింది.

[రెండవ టీవీ రిపోర్టర్] …సోషల్ నెట్ వర్కింగ్ యాప్ మహారాణిగా ఈ మధ్య ప్రఖ్యాతి పొందింది.

హలో, హోవర్డ్.

[మూడవ టీవీ రిపోర్టర్] సెలీనా గోమెజ్ ఇంకా జస్టిన్ బీబర్

-ఎట్టకేలకు విడిపోయారు. -[నాలుగో టీవీ రిపోర్టర్] మళ్లీనా?

నిజంగా? నేనొక రాక్ స్టార్ అని నేనే అనుకోను.

-[జిమ్మీ ఫాలన్] ఇంకా ఈ ఆల్బమ్, రివైవల్… -[ప్రేక్షకుల కేరింతలు]

…జనం ఏం అంటున్నారంటే… ఇదే నెంబర్ వన్ గా నిలుస్తుంది అని,

ఆమె టూర్ కూడా త్వరలో ప్రారంభమవుతుంది, కదా? మే నెలలోనా?

[గోమెజ్] మే నెలలో నా పర్యటన ఉంటుంది.

ఓహ్, నేను నిజానికి ఎల్.ఎ. స్పోర్ట్స్ ఎరీనాలో ఉన్నాను.

హమ్, నేను బయలుదేరడానికి ఇంకా రెండు రోజులు సమయం ఉంది, తరువాత టూర్ మొదలవుతుంది.

నాతో పాటు నా హెయిర్ ఇంకా మేకప్ టీమ్ ఉన్నారు, మేము ప్రతి రోజూ కొత్తగా ఏదో ప్రయత్నిస్తున్నాం.

మేము కొన్ని ప్రయోగాలు చేస్తున్నాం, దాంతో… అంటే,

ఈ షోలో ఏం చేయాలన్నది ఆలోచిస్తున్నాం. ఈ ప్రదర్శనకి ఒక గుర్తింపు కోసం.

-[గోమెజ్] ఇది నచ్చుతుందా? -[మాట్లాడుతున్నారు]

ఆ అద్దంలో తెల్లగా ఏదో కనిపిస్తోంది ఏంటది?

బహుశా ఈ చెమ్కీలు అనుకుంటా. [చిన్నగా నవ్వింది]

నేను తీస్తాను… మధ్యలో నుంచి కొద్దిగా తీస్తాను. సరే.

వాటికి ఆ చిన్న వజైనా పట్టీలు కూడా ఉన్నాయి కదా?

-[స్టయిలిస్ట్] అవును. ఉన్నాయి. -బహుశా ఆ చదునుగా ఉన్నవి అనుకుంటా.

-నాకు తెలియదు. కొద్దిగా తేడాగా ఉంది. -[స్టయిలిస్ట్ చిన్నగా నవ్వింది]

నేను గనుక అబ్బాయిని అయితే, జీన్స్ వేసుకుని టీ షర్ట్ మార్చేసుకునే దాన్ని

-నెత్తి మీద బీనీ క్యాప్ పెట్టుకునే దాన్ని… -[నవ్వుతున్నారు]

-…అప్పుడు నన్నెవ్వరూ పట్టించుకునే వారు కాదు. -[డ్రెస్ జిప్ వేస్తోంది]

నిజానికి, ఈ వక్షోజాలు బాగానే ఉన్నాయనుకుంటా.

-నాకు తెలియదు. -[డిజైనర్] నీకు నచ్చిందా?

-వక్షోజాలు ఇంకొంచెం ఉండాలి. -“వక్షోజాలు” మరీ పద్ధతిగా ఉంది.

[గోమెజ్] నా వజైనా మాత్రం…

-[స్టయిలిస్ట్] లేదు, అది కాదు. ఇది కేవలం… -…ప్రతి పిచ్చి డ్రెస్ లో కనిపిస్తుంది.

-అది నీది కాదు… -ఇది…

-…ఊరికే నా మీద నేనే జోక్ చేసుకుంటున్నాను. -[రెండో స్టయిలిస్ట్] ఆగు. ఇలా వచ్చి చూడు.

-[మూడో స్టయిలిస్ట్] అది నువ్వు కాదు. అది నా వజైనా. -నిజంగా. ఇది నా వజైనా.

దానిని గర్వంగా వేసుకునే శరీరం నాకుంది, కానీ నా పిరుదులు పెద్దగా లేవు, అవి కావాలి.

-నా శరీరం మరీ లేతగా ఉంది. -[ఫ్యాషన్ టీమ్ సభ్యుడు] అవును.

-“ఓహ్, ఆగు” అనేలా ఉండకూడదని కోరుకుంటున్నా. -[బృందం మాట్లాడుతున్నారు]

నేను ఒక ఆడపిల్లలా కనిపించాలి కానీ పన్నెండేళ్ల అబ్బాయిలా కాదు.

[“హూ సేస్” పాట పియానో మీద ప్లే అవుతోంది]

♪ మరొకరిలా ఉండటం నాకిష్టం లేదు ♪

♪ అవును ♪

♪ నువ్వు నాలో అభద్రత కలిగించావు ♪

ఫైనల్ టూర్ రిహార్సల్

♪ నేను నీకు సరిపడనని చెప్పావు ♪

♪ కానీ నన్ను జడ్జ్ చేయడానికి నువ్వెవరు నువ్వే మకిలి పట్టిన వజ్రానివి అయినప్పుడు ♪

♪ నాకు తెలిసి నువ్వు కొన్ని విషయాలలో నిన్ను నువ్వు మార్చుకోవాలి అనుకుంటున్నావు ♪

♪ కానీ నా విషయానికి వస్తే నేను మరెవ్వరిలాగా ఉండాలని కోరుకోను ♪

♪ న…న…న…న, న…న…న…న, న…న…న…న…న ♪

♪ న…న…న…న, న…న…న…న, న…న…న…న…న ♪

♪ నేను ఏమీ బ్యూటీ క్వీన్ ని కాను, నేను కేవలం అందమైన దానిని ♪

♪ న…న…న…న, న…న…న…న, న…న…న…న…న ♪

♪ న…న…న…న, న…న…న…న, న…న…న…న…న ♪

♪ ఇంకా నీకు అన్ని హక్కులూ ఉన్నాయి ఒక అందమైన జీవితం పొందడానికి ♪

♪ చూడండి ఎవరు అన్నారు? ♪

♪ నువ్వు పెర్ఫెక్ట్ కాదు అని ఎవరు అన్నారు? నీకు అంత విలువ లేదని ఎవరు అన్నారు? ♪

♪ నువ్వు మాత్రమే బాధ పెడుతున్నావని ఎవరు అన్నారు? ♪

♪ నన్ను నమ్మండి అందానికి చెల్లించే మూల్యం అది ♪

♪ నువ్వు అందంగా లేవని ఎవరు అన్నారు? ♪

♪ నువ్వు అందమైనదానివి కాదని ఎవరు అన్నారు? ♪

♪ ఎవరు అన్నారు? ♪

[రాగం పాడుతోంది]

♪ ఈ డ్రెస్ చాలా పొడవుగా ఉంది ♪

♪ ఇది తెరుచుకునే తీరు చిరాకు కలిగిస్తోంది ♪

అది చెత్తలా ఉంది.

-[మొదటి ఫ్రెండ్] ఏం పొరపాటు జరిగింది? -అంతా చెత్తలాగే ఉంది. చాలా ఘోరంగా ఉంది.

[గోమెజ్ బాధగా] నేను ఎలా ఉన్నానంటే…

నేను ఏం చేస్తున్నానో నాకే తెలియడం లేదు. [ముక్కు ఎగబీల్చింది]

-[రెండో ఫ్రెండ్] నీకు ఏ విషయంలో బాధ కలిగింది? -ఆహ్, మొదటి నుంచి. [ముక్కు ఎగబీల్చింది]

నేను ఏదో మిస్ అయ్యానని నా తలలో నాకు ఎవరో చెబుతున్నట్లు వినిపిస్తుంది.

అది చెత్తలా ఉంది. అది చిరాకు తెప్పించింది.

ఓహ్, తెర మీద నన్ను నేను చూసుకున్నాను.

వావ్, అది చాలా చెత్తలా కనిపించింది.

ఆ తరువాత నేను అక్కడ కూర్చుని నా డ్రెస్… డ్రెస్ లో చిక్కుకుపోయి తడబడుతుంటాను

ఇంకా, అంటే, అది కేవలం…

-అంటే, నా ప్రాణం తీసేసినట్లు అనిపిస్తుంది… -[రెండవ ఫ్రెండ్] సరే.

…ఇంక నాకు ప్రదర్శన ఇవ్వబుద్ధి కాదు. [ముక్కు ఎగబీలుస్తుంది]

ఆ ఒత్తిడి చాలా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే నేను అద్భుతమైన ప్రదర్శన ఇవ్వాలి అనుకుంటాను

కానీ నేను… నేను ఇవ్వలేను… అది నా వల్ల కాదు… [ముక్కు ఎగబీలుస్తుంది]

జాన్ ఏం అనుకుంటాడో నాకు తెలియదు.

నేను జాన్ తో మాట్లాడాలి ఎందుకంటే నాకు… నాకు జాన్ ని నిరాశ పర్చాలని లేదు.

తను ఒక చెత్త డిస్నీ పిల్లతో ఒప్పందం కుదుర్చుకున్నానని అతను అనుకోవడం నాకు ఇష్టం లేదు, అంటే…

జాన్ అక్కడే నిలబడి ఉన్నాడు, ఎలాగంటే,

-పెద్దగా నవ్వుతున్నాడు. -జాన్ ఉత్సాహంగా ఉన్నాడు.

[ఫ్రెండ్] అంతా నీ తలలోనే ఉంది.

ఈ మొత్తం పాట పాడటం, ఇదంతా, అంటే, అది కూడా చెత్తలా అనిపిస్తుంది.

జస్టిన్ తో కలిసి నేను పాడటం గురించి అతను ఉదయం నాకు ఫోన్ చేశాడు,

-కానీ నాకు ఏం అనిపించింది అంటే… -[మొదటి ఫ్రెండ్] ఆ డిజె విషయమా, హమ్?

“అంటే, నా అంతట నేను ఎప్పటికి బాగా రాణిస్తాను?”

-[మేనేజర్] దాని గురించి ఆందోళన పడద్దు. -అంటే, నేను ఎప్పటికి… అంటే…

నా అంతకు నేను ఎప్పటికి బాగా రాణిస్తాను?

ఎవరితోనూ కలిసి పాడే పరిస్థితి రాకుండా ఉండాలి.

-అంటే, అది చాలా చెత్త… -[మేనేజర్] నీకు ఇప్పటికే మంచి పేరు ఉంది.

[మొదటి ఫ్రెండ్] హాయ్, జాన్.

-నన్ను క్షమించు. -[జానిక్] నువ్వు దేని గురించి సారీ చెబుతున్నావు?

నా…నాతో ఒప్పందం కుదుర్చుకుని తప్పు చేశానని నువ్వు ఎప్పుడూ బాధపడకూడదని…

-ఏంటి? -…లేదా ఇంకా ఏదో కావాలి అనిపించకూడదు…

జాన్ - చైర్మన్, ఇంటర్ స్కోప్ జెఫెన్ ఎఅండ్ఎమ్ రికార్డ్స్

-నువ్వు అద్భుతంగా పాడుతున్నావు. -మేము ఇద్దరం నీ పక్కనే నిలబడి ఉన్నాం.

ఆ కాస్ట్యూమ్ ఘోరంగా ఉంది. అంతా చాలా ఘోరంగా అనిపిస్తోంది.

నువ్వు అద్భుతంగా ఉన్నావు. అది చాలా బాగుందని నాకు అనిపించింది.

నేను నిన్ను కౌగలించుకోవచ్చా? నీకు ఒక హగ్ ఇస్తాను. [చిన్నగా నవ్వాడు]

నువ్వు అద్భుతంగా ప్రదర్శించావు అనుకున్నా. అది చాలా బాగుంది.

-[రెండవ ఫ్రెండ్] నిజంగా. -“మీ అండ్ మై గర్ల్స్” క్రేజీగా ఉంది. అంటే అది…

[మొదటి ఫ్రెండ్] నిజం. జాన్ అక్కడ ఇలా నిలబడి ఉండిపోయాడు. జాన్ అలా చూస్తుండిపోయాడు…

నేను చాలా ఆస్వాదించాను. అది అద్భుతమైన ప్రదర్శన.

[గోమెజ్] అది ఏమైనా కుర్రతనంగా ఉందా?

-అదేమీ కుర్రతనంగా లేదు. -[రెండో ఫ్రెండ్] లేదు.

నాకు… నా గతంలా కాకుండా ఉండటం కన్నా ఇంకేమీ అవసరం లేదు.

కానీ అది తిరిగి వస్తూనే ఉంది.

ఇప్పటికి నీ అతి పెద్ద శత్రువు నువ్వే.

ఈ ఆలోచనలన్నీ నీ బుర్రలోకి ఎక్కించుకుని, అంటే, అది నిన్ను కబళించేలా చేసుకోకు.

-కాస్ట్యూమ్స్ మార్చుకోవచ్చు. -[మొదటి ఫ్రెండ్] హా.

లైట్స్ మార్చుకోవచ్చు. సెట్స్ ని మార్చుకోవచ్చు.

నీకు స్టేజ్ వద్దు అనుకుంటే, నువ్వు నేల మీద కూడా ప్రదర్శన ఇవ్వచ్చు.

జనానికి ఏది నచ్చుతుంది, ఏది నచ్చదు అనేది అవసరం లేదు. నీకు నచ్చడమే ముఖ్యం.

నీకు అది బాగుందని అనిపించాలి. ఇది నీ షో.

దాని గురించి నువ్వు ఆత్మవిమర్శ చేసుకోకు. అంతా బాగానే ఉంటుంది.

-జాన్, థాంక్యూ. -నిన్ను కలుసుకోవడం గొప్పగా ఉంది.

-సారీ. థాంక్యూ. సారీ. -త్వరలో మళ్లీ కలుస్తాను.

థాంక్యూ. లేదు. ఇది నిజంగా గొప్పగా ఉంది.

థాంక్యూ.

-[ముక్కు ఎగబీలుస్తోంది] -[మొదటి ఫ్రెండ్] ఆవ్.

సారీ. [ఏడుస్తోంది]

ఇది నేను భరించలేకపోతున్నాను.

[జట్టు సభ్యురాలు] వాళ్లు వస్తున్నారు.

మాండలే బే లైట్ నైట్ క్లబ్ - శుక్రవారం, మే 6

సెలీనా గోమెజ్ అందిస్తోంది అఫీషియల్ ఆఫ్టర్ పార్టీ

[జనం మాట్లాడుకుంటున్నారు]

తొలిసారి ప్రదర్శన

నా పునరుజ్జీవనం సెలీనా గోమెజ్ రివైవల్ టూర్ 2016

-[గోమెజ్] థెరెసా? -[అసిస్టెంట్] హేయ్, అమ్మాయి.

-నా బ్లడ్ ప్రెషర్ మెషీన్ తీసుకువచ్చావా? -తెచ్చాను. ఇదిగో ఇక్కడే ఉంది.

[అసిస్టెంట్] ఇది నీ లూపస్ వ్యాధి గురించి, కదా?

అవును.

-ఇప్పుడు నేను ఇది నొక్కాలా? మొదలుపెట్టవచ్చా? -హమ్…హమ్. హమ్…హమ్.

-ఇది బాగుంది, కదా? -చక్కగా ఉంది.

[అసిస్టెంట్] నీకు ఎలా తెలుస్తుంది?

అయితే, 109 ఇంకా 78 అంటే నిజంగా మంచిదే.

మనకి సాధారణంగా ఉండే సగటు బిపి 120 ఇంకా 78.

కానీ నాకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువగా ఉంటే,

అది సాధారణంగా 150, 145 స్థాయిలో ఉండి కింది స్థాయిలో వంద వరకూ ఉంటుంది,

-దాని అర్థం ఏమిటంటే నాకు గుండెపోటు రావచ్చు. -అయ్యో.

[అసిస్టెంట్] అర్థమైంది.

-కాబట్టి అది 120 కంటే తక్కువ ఉన్నంత వరకూ… -టూర్ కోసం మనం దీనిని ఇక్కడే ఉంచుదామా?

అంటే, నీ చిన్ని దాంట్లో…

-అంటే, బహుశా మన బస్సులో ఉంచు. -సరే.

మనం ఎక్కడికి వెళ్లినా ఇది మనతో ఉండాలి, ఏదైనా అవసరం రావచ్చు.

[మేనేజర్] నీ కోసం ఒక బహుమతి తెచ్చాము, ఆ తరువాత నిన్ను ఒంటరిగా వదిలేస్తాము.

-[చిన్నగా నవ్వుతోంది] -నువ్వు దీనితో మొదలుపెట్టగలవా?

నేను, జాక్ కలిసి ఇస్తున్నది.

అలీన్ ఇంకా జాక్ సెలీనా మేనేజర్లు

ఇది నీ కోసం, టూర్ కోసం మేము సేకరించినది.

[గోమెజ్] ఇది ఏంటి?

ప్రతి రోజు రాత్రి, నీకు గుడ్ లక్ అందించే ఒక పదం వస్తుంది

అది నువ్వు ఆలోచించేది అవుతుంది…

[మోర్గన్రోత్] దీనిని నీ మేకప్ టేబుల్ మీద పెట్టుకో.

…ఇది నీకే. ప్రతి ప్రదర్శన భిన్నంగా ఉండబోతుంది.

-ఇది చాలా బాగుంది. -[గోమెజ్] ఓహ్, దేవుడా.

-సరే, ఇవి చూడు. -[టీమ్ సభ్యురాలు] చాలా బాగుంది.

ఇది చూసి మేము దాదాపు ఏడ్చాము.

ప్రతి రోజు నువ్వు ఒకటి ఎంచుకోవాలి.

-ఇది చాలా అందంగా ఉంది. -ఎంత బాగుందో కదా?

-చాలా థాంక్స్. -నిన్ను మేము చాలా ప్రేమిస్తాము.

[కేషిషియాన్] ఇక, నీకు మా ప్రశ్న ఏమిటంటే,

నీకు మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాలు ఎక్కువయ్యాయి అనిపిస్తోందా?

అవి గంటన్నర పాటు ఉంటాయి.

అంత సమయం పడుతుందని నేను అనుకోను.

-నువ్వు ఏం అంటావు? -కొన్నిసార్లు నన్ను ఇబ్బందిపెడతారు.

-ఈ రోజు నా పుట్టినరోజు. -అవునా? హ్యాపీ బర్త్ డే.

-థాంక్యూ. -నీ వయస్సు ఎంత?

-నాకు పదమూడేళ్లు. -ఓహ్, దేవుడా.

నా మూడేళ్ల వయస్సు నుండి ప్రతి ఏడాది నీ పుట్టినరోజు జరుపుకుంటున్నాను.

-నా పుట్టినరోజునా? -నా దగ్గర…

నేను బర్త్ డే పార్టీలు, కేకులు, పాటలు, అన్నీ చేస్తాను.

-నువ్వు చాలా మంచిదానివి. థాంక్యూ. -[ఫోటోగ్రాఫర్] ఒక ఫోటో తీసుకుందామా?

-ఇదిగో తీసుకో. -చాలా ఉద్వేగంగా…

-[ఫోటోగ్రాఫర్] మూడు, రెండు. -సరే. మనం తీసుకుందాం.

-చాలా ముద్దుగా ఉంది. -[పేరెంట్] హేయ్, ఏడవకు.

[ఫోటోగ్రాఫర్] ఆహ్. అయిపోయింది.

“నెంబర్ వన్ ప్రియుడు” అని ఇక్కడ రాయగలవా?

-అలాగే. -[నవ్వుతున్నారు]

[గోమెజ్ నవ్వుతోంది]

అవును. అంటే, నాకు వేర్వేరు అమ్మాయిలు ఉన్నారు.

-[నవ్వుతోంది] -నేను…

నేను నెంబర్ వన్ అవుతానా?

-అవును. -సరే, అలాగే.

-[మాట్లాడుకుంటున్నారు] -[పియానో ప్లే అవుతోంది]

[టీమ్ సభ్యురాలు] వీళ్లిద్దరూ కొన్ని చెడు విషయాలు విన్నారు.

♪ …అది హల్లెలూయా హల్లెలూ… ♪

మీరు ఇంతగా కష్టపడినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు.

మీరు చేసింది నాకు ఎంత ముఖ్యమో మీరు కనీసం ఊహించలేరు.

నేను ఇంతవరకూ చేసిన అన్ని టూర్స్ లో ఇదే చాలా ముఖ్యమైనది,

అందుకే నేను ప్రతి రోజూ గందరగోళం అయిపోయాను, ఆ విషయం మీకు తెలుసు.

మనం వేదిక మీదకి వెళదాం, ప్రేక్షకులకు స్ఫూర్తిగా ఉందాం, ఇంకా మన ప్రదర్శనని ఆస్వాదిద్దాం.

మన పాదాల్ని, మన చేతుల్ని, మన వాయిద్యాల్ని, ప్రతీదాన్ని ఆశీర్వదిద్దాం.

మన లైట్లు, బాజ్, మెలీసా, ప్రతి ఒక్కరినీ.

-మీ అందరికీ నా ప్రేమ. ఆ ప్రభువు సాక్షిగా. ఏమెన్. -[టూర్ బృందం] ఏమెన్!

[ప్రేక్షకుల కేరింతలు]

[“మీ అండ్ మై రిథమ్” పాట ప్లే అవుతోంది]

♪ ఊహ్, ఘర్షణే అంతటా ఉంది ♪

♪ నీ చరిత్ర ఏదైనా కానీ ♪

♪ నాతో ఫ్రీగా ఉండు, ఓహ్ ♪

♪ ప్రతి ఒక్కరూ స్పర్శని కోరుకుంటారు అందరికీ ఏదో ఒకటి కావాలి ♪

♪ కానీ ప్రేమ గురించి నువ్వు పాట వినిపించవా ♪

♪ నా శరీరాన్ని నేను కదిలిస్తే ♪

♪ నేను ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ♪

♪ రసాయనాలు వాటి పని అవి చేస్తాయి ♪

♪ మనలోని శక్తి విపరీతంగా ఎక్కువయ్యే వరకూ ♪

♪ ఓహ్ ♪

♪ అవును, నాకు కావలసిందల్లా ♪

♪ రిథమ్ మాత్రమే, ఓహ్ ఓహ్ ♪

♪ మీ అండ్ మై రిథమ్ ♪

♪ ఓహ్ ఓహ్, మా మధ్య ఇంకేమీ వద్దు ♪

♪ అవును, రిథమ్ మాత్రమే, ఓహ్ ఓహ్ ♪

♪ మీ అండ్ మై రిథమ్, ఓహ్ ఓహ్ ♪

[ప్రేక్షకులు] ♪ ఎవరు అన్నారు, ఎవరు అన్నారు? ♪

♪ అది ఎవరు అన్నారో నాకు చెబుతావా? ♪

♪ అవును, ఎవరు అన్నారు? ♪

♪ ఎవరు అన్నారు? నువ్వు పెర్ఫెక్ట్ కాదు అని ఎవరు అన్నారు? ♪

♪ నీకు అంత విలువ లేదని ఎవరు అన్నారు? ♪

♪ నువ్వు మాత్రమే బాధ పెడుతున్నావని ఎవరు అన్నారు? ♪

♪ నన్ను నమ్ము, అందంగా ఉన్నందుకు అది మనం చెల్లించే మూల్యం ♪

♪ నువ్వు ముద్దుగా లేవని ఎవరు అన్నారు? ♪

♪ నువ్వు అందంగా లేవని ఎవరు అన్నారు? ♪

[ప్రేక్షకులు, గోమెజ్] ♪ ఎవరు అన్నారు? ♪

-[ప్రేక్షకుల కేరింతలు] -ఓహ్.

-[షటర్స్ శబ్దాలు] -[అభిమాని] సెలీనా!

-మేము బిగ్ బెన్ దగ్గర ఉన్నాం. ఏంటి విషయం? వూహూ! -[నవ్వుతున్నారు]

[“మీ అండ్ మై గర్ల్స్” పాట ప్లే అవుతోంది]

♪ నేను నా అమ్మాయిలు, నేను నా అమ్మాయిలు ♪

♪ నేను ఇంకా నా, నేను ఇంకా నా నేను ఇంకా నా, నేను ఇంకా నా అమ్మాయిలు ♪

[మరియాచీ మ్యూజిక్ ప్లే అవుతోంది]

-[“మీ అండ్ మై గర్ల్స్” పాట కొనసాగుతోంది] -[మాట్లాడుతున్నారు]

[టీవీ రిపోర్టర్] ఆమెకు డ్రగ్స్ అలవాటు ఉందని వదంతులు ఉన్నాయి…

[రెండో టీవీ రిపోర్టర్] సెలీనా ఎక్కువగా పార్టీలు చేసుకుంటోంది. తన పరిస్థితి అదుపు తప్పింది.

[ప్రేక్షకుల కేరింతలు]

వెళదాం పదండి!

-[ప్రేక్షకులు గోల చేస్తున్నారు] -[ఇంజన్ గుయ్యిమంటోంది]

నేను కొద్దిసేపట్లో స్టేజ్ మీదకి వెళ్లబోతున్నాను.

-నన్ను విష్ చేయండి. -[కేరింతలు]

[“సోబర్” పాట ప్లే అవుతోంది]

♪ నన్ను ఎలా ప్రేమించాలో నీకు తెలియదు నువ్వు హుందాగా ఉన్నప్పుడు ♪

♪ సీసా ఖాళీ అయ్యాక నన్ను దగ్గరకు లాక్కుంటావు… ♪

[అభిమాని] సెలీనా, ఐ లవ్యూ.

[మీడియా ప్రతినిధి] మీరు రీహాబ్ కి వెళ్లడానికి జస్టిన్ బీబర్ కారణమా?

[రిపోర్టర్] జస్టిన్ కి కొత్త గర్ల్ ఫ్రెండ్ దొరికింది.

[రెండవ మీడియా ప్రతినిధి] మీకు అసూయగా ఉందా, సెలీనా?

♪ అదే తరహా పాత ప్రేమలతో నేను విసిగిపోయాను ♪

సెలీనా. నువ్వు మళ్లీ తాగుడు మొదలుపెట్టావా?

-సెలీనా. ఆల్కహాల్ ఎక్కడ? -నువ్వు మళ్లీ తాగడం మొదలుపెట్టావా?

-[గోమెజ్] పాడండి. -[అందరూ పాడుతున్నారు]

[ప్రేక్షకులు] ♪ అదే తరహా పాత ప్రేమతో నేను విసిగిపోయాను ♪

♪ ఆ చెత్త, అది నన్ను హింస పెడుతుంది ♪

-నేను చస్తున్నాను. -[టీమ్ సభ్యుడు] సరే.

[గోమెజ్] నేను ఏం మిస్ అవుతున్నాను? అంటే, నాకు ఏం కావాలి?

[ఫ్రెండ్] ప్రతి ఒక్కరూ లేచి నిలబడ్డారు…

చూడండి, చాలామంది వచ్చారు. సారీ. చాలా మంది ఉన్నారు.

-[ఫ్రెండ్] విశ్లేషించడం ఆపు. -[గోమెజ్] లేదు.

-[ఫ్రెండ్] హ్యాపీగా ఉండు. -నేను హ్యాపీగానే ఉన్నా.

నాకు ఇది ఇష్టం లేదు. [గుర్రుమంటోంది]

[దీర్ఘంగా శ్వాస పీలుస్తోంది]

ఒక చెత్త అమ్మాయిలా ఉండటం చాలా కష్టం

పైగా ఇప్పటికే కొద్దిగా పిచ్చి ఉంది.

నాకు దాని వల్ల కూడా కోపం వస్తుంది.

వేగంగా దుస్తులు మార్చుకుంటున్నాను,

తరువాత ఇలా విప్పితే ఒక స్లీవ్ పోతుంది, ఇంకా ఇలా ఇంకొకటి విప్పాలి,

తరువాత మొత్తం కింది సగభాగాన్ని విప్పేయాలి.

♪ ఓహ్ అది… ♪

[రిపోర్టర్] జస్టిన్ గురించి మీ ఫీలింగ్ ఏంటి?

[రెండవ రిపోర్టర్] మీరు డిప్రెస్ అయ్యారా?

-[మూడో రిపోర్టర్] అలిసిపోయారా? -[నాలుగో రిపోర్టర్] ఎప్పుడూ అలుపే.

[మీడియా ప్రతినిధుల గోల]

కొన్నిసార్లు నేను… నేను లేచేసరికి, నాలో ఇదివరకటి ఉత్సాహం లేదని అనిపిస్తుంది.

యాభై అయిదు ప్రదర్శనల తరువాత రివైవల్ టూర్ రద్దయింది

[రిపోర్టర్] సెలీనా ప్రస్తుతం విరామంలో ఉంది,

ఆమె ఆందోళన, భయం ఇంకా డిప్రెషన్ వంటి మానసిక రుగ్మతలతో సతమతం అవుతోంది.

[రెండవ రిపోర్టర్] ఆమెకు డ్రగ్స్ వ్యసనం ఉందని వదంతులు ఉన్నాయి.

[మూడో రిపోర్టర్] సెలబ్రిటీగా పార్టీలతో విలాసవంతమైన జీవితాన్ని గడపడం వల్ల

ఆమె ఆరోగ్యం ఇంకా ఆమె కెరీర్ దెబ్బతిన్నాయి.

[అసిస్టెంట్] ఒక దశలో, ఆమె ఏం అనేదంటే, “నాకు ఇప్పుడు బతకాలని లేదు.

నాకు బతకాలని లేదు” అనేది.

థెరెసా మాజీ అసిస్టెంట్

అప్పుడు నేను అనేదాన్ని, “ఆగు, ఏంటి?” అని.

అటువంటి సందర్భాలలో

తన కళ్లలోకి చూస్తే ఏమీ కనిపించేది కాదు.

ఆ కళ్లు నల్లగా ఉండి భయం వేసేది.

అప్పుడు అనుకునే వాళ్లం, “సరే, వదిలేయ్.

ఇలా ఆలోచించడం ఆపేయ్, మనం ఇంక ఇంటికి వెళ్లిపోవాలి” అని.

ఆమెతో మేము చాలా సీరియస్ గా చర్చించే వాళ్లం, ఎలా అంటే…

రఖేల్ సెలీనా ఫ్రెండ్

…“ఏం జరుగుతోంది?” అని.

అప్పుడు ఆమె జవాబు ఎలా ఉండేదంటే, “నాకు తెలియదు. నేను వివరించలేను.

నా బుర్రలో నాకు ఏం అనిపిస్తుందో అది మీరు కూడా ఫీల్ అయితే బాగుండేది అనిపిస్తుంది.”

అది చాలా గోలగా ఉండడం నాకు గుర్తుంది, ఇంకా ఆమె మెదడులో ప్రతికూల గొంతులు వింటూ ఉండేది.

అవి రానురాను పెద్దగా, ఇంకా పెద్దగా, మరింత పెద్దగా అయిపోయేవి.

దానితో ఆమెలో ఏదో తీవ్రమైన సైకోటిక్ ప్రవర్తన మొదలైంది.

సెలీనా గోమెజ్ కొద్ది వారాల పాటు తీవ్రమైన పరిస్థితుల్లోకి వెళ్లిపోయింది.

గత ఏడాది ఆమె లూపస్ వ్యాధితో పోరాడింది కానీ ఒక కిడ్నీ మార్పిడి ఆమె ప్రాణాన్ని కాపాడింది.

దాని ఫలితంగా,

ఆ సెప్టెంబర్ చివరి వారంలో ఆమె తెల్ల రక్తకణాల సంఖ్య చాలా వరకూ తగ్గిపోయింది.

మామూలుగా అది ఒక వైద్యపరమైన తీవ్ర పరిస్థితి కానీ అది అంతకన్నా తీవ్రమైన మానసిక సమస్యకి దారి తీసింది.

[రెండవ రిపోర్టర్] ఆమె తన ఇంట్రావినస్ సూదుల్ని తొలగించడానికి ప్రయత్నించింది.

ఆమె ఎంత ఘోరంగా తయారైందంటే, ఆమెను సైకియాట్రిక్ హాస్పిటల్ కి తీసుకువెళ్లవలసి వచ్చింది.

టిఎంజెడ్ ద్వారా ఆమె మానసికంగా దెబ్బతినిందని మేము తెలుసుకున్నాం.

వాళ్లు నన్ను పిలిచి ఏం తెలుసుకోవాలి అనుకున్నారంటే…

మ్యాండీ సెలీనా తల్లి

…నెర్వస్ సమస్యతో హాస్పిటల్ లో నా కూతురు ఏం చేస్తోందని అడిగేవారు.

నా జోక్యాన్ని ఆమె అస్సలు ఒప్పుకునేది కాదు,

దానితో తను చనిపోతుందేమో అని భయపడ్డాను.

[స్టివెన్స్] నేను చూసినది ఇంకెవరైనా చూసి ఉంటే

ఇంకా ఆ మెంటల్ హాస్పిటల్ లో ఆమె పరిస్థితి ఎలా ఉందంటే

ఆమెను ఎవ్వరూ గుర్తు పట్టి ఉండేవారు కాదు.

నేను కుంగిపోయాను

ఎందుకంటే సైకోసిస్ చికిత్స కొన్ని రోజుల నుంచి, కొన్ని వారాలు, కొన్ని నెలలు,

కొన్ని సంవత్సరాలు, జీవితాంతం ఉండచ్చు.

మనం వీలైనంత స్థయిర్యంగా ఉంటూ చికిత్స విషయంలో సహకరిస్తూ ఉండటమే

చాలా కష్టమైన పని,

తరువాత తను నిద్రపోయాక మరు ఉదయం తను మేలుకొంటుందని ఆశగా గడపాల్సి వచ్చేది.

[గోమెజ్] నా ఆలోచనలు ఒక్కోసారి నా మెదడుని ఆక్రమించేవి.

నా గతం గురించి ఆలోచిస్తే చాలా బాధ కలుగుతుంది.

నేను మళ్లీ శ్వాస పీల్చడం ఎలాగో నేర్చుకోవాలి అనిపించేది.

నన్ను నేను ప్రేమించుకుంటున్నానా?

నా సొంతంగా శ్వాస పీల్చడం ఎలాగో నేను ఎలా నేర్చుకోవాలి?

[దీర్ఘంగా శ్వాస పీలుస్తోంది]

[టీఫీ] ఆమె కోలుకోవడం అనేది ఓ అద్భుతం…

[గద్గద స్వరంతో] …కానీ మళ్లీ అలాంటి పరిస్థితి వస్తుందనే భయం మాత్రం ఎప్పుడూ ఉంటుంది,

అది మమ్మల్ని అంతగా బాధపెట్టింది.

ఇంటికీ ఇంకా నీ మంచానికి స్వాగతం గ్జోగ్జో లవ్ ఎస్ + గ్రేసీ

[గోమెజ్] బైపోలార్ వ్యాధి ఉందని డయాగ్నోసిస్ ద్వారా నాకు తెలిసింది.

నేను నిజాయితీగా చెప్పాలి,

నాకు మెంటల్ హెల్త్ హాస్పిటల్ కి వెళ్లడం ఇష్టం లేదు.

నేను వెళ్లాలి అనుకోలేదు,

కానీ నాలో నేను… నా ఆలోచనల ఉచ్చులో నేను పడదల్చుకోలేదు.

నా జీవితం అయిపోయింది అనుకున్నాను, ఇంకా “నా జీవితాంతం ఇలాగే ఉంటుంది” అనిపించేది.

అందుకే నేను అందరితో ఒకటే చెప్తాను, నాకు గొప్ప కుటుంబం ఇంకా స్నేహితులు ఉన్నారు,

ముఖ్యంగా మా అమ్మ ఇంకా నా సవతి తండ్రి, బ్రయన్.

ఎందుకంటే నేను అంత దురుసుగా వారితో మాట్లాడకుండా ఉండాల్సింది,

కొన్నిసార్లు నేను వాళ్లతో ప్రవర్తించిన విధంగా నేను ప్రవర్తించకుండా ఉండాల్సింది. [ముక్కు ఎగబీలుస్తోంది]

కానీ తరువాత అది నేను కాదు అని వాళ్లు తెలుసుకున్నారు,

ఆ తరువాత నేను మరుసటి ఉదయం మేలుకొన్నప్పుడు, వాళ్లు ఏమన్నారంటే…

[తడబడుతూ] ఏం జరిగిందో నాకు చెప్పేవారు, కానీ వాళ్లు ఎలాగంటే… నాకు వివరించే వారు…

వాళ్లు ఏమనేవారంటే, “చూడు, అలా మాట్లాడుతున్నది నువ్వు కాదని మాకు తెలుసు,

మేము నిజంగా ఆందోళనగా ఉన్నాం, ఇంకా… మేము నిన్ను ప్రేమిస్తున్నామని మాత్రం తెలుసుకో.

నిన్న రాత్రికి, ఇప్పటికీ మాకు ఏదీ తేడాగా కనిపించడం లేదు” అనేవారు.

కానీ నేను వాళ్లతో ఈ విషయమే ప్రస్తావిస్తే,

నేను ఒకే మాటని పదే పదే చెబుతాను, తెలుసా?

“చాలా సారీ” అని చెబుతాను.

ఎందుకంటే నేను చేసిన కొన్ని పనులు నాకు గుర్తున్నాయి

అప్పుడు నేను చాలా ఘోరంగా ప్రవర్తించే దాన్ని.

అందుకే, అంటే… ఈ రోజుకి కూడా, నేను “థాంక్యూ” ఇంకా “సారీ” చెబుతుంటాను,

ఇంకా నేను చేసే ప్రతీ పని…

వాళ్లు ఎప్పుడూ ఒకటే చెబుతారు, “నీ డయాగ్నోసిస్ గురించి మాకు తెలిశాక,

మాకు ప్రతి విషయం అర్థమవుతోంది, సెలీనా” అని.

నువ్వు ఎప్పటికంటే కూడా ఇప్పుడు చాలా మెరుగ్గా ఉన్నావు,

అది మేము చూడగలుగుతున్నందుకు చాలా సంతోషిస్తున్నాం, మేము నీ విషయంలో ఎప్పుడూ, మా ఆశని వదులుకోము" అంటారు.

చాలా సందర్భాలలో వాళ్లు ఆశలు వదులుకునే సమయాల్లో కూడా ఎప్పుడూ అలా ఉండలేదు.

[తడబడుతూ] నేను మానసికంగా ఆరోగ్యంగా ఉన్నాను, కానీ…

[నిట్టూర్చింది] నాకు తెలియదు.

కొన్నిసార్లు నేను ఖచ్చితంగా వివరించలేను.

[పియానో వాయిస్తోంది]

-[ఆఫ్ కీ వాయిస్తోంది] -కాదు.

పూర్తిగా మర్చిపోయాను.

నేను హాస్పిటల్ నుంచి బయటకు వచ్చాక,

నా రుగ్మతతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియలేదు.

అది మళ్లీ తిరిగి వస్తే ఏంటి?

మరోసారి నేను తిరిగి రాలేకపోతే ఏంటి?

నేను దాని గురించి తెలుసుకోవడం అవసరమైంది.

నేను రోజు రోజుకు కొంత తెలుసుకోగలిగాను.

నా చిన్నతనంలో ఉరుముల శబ్దాలు విని భయపడిపోయే దాన్ని.

నేను టెక్సాస్ లో పెరిగాను,

ఉరుములు మెరుపులు వస్తే ఒక పెను తుఫాను వస్తోందని భయపడిపోయే దాన్ని.

కానీ మా అమ్మ కొన్ని పిల్లల పుస్తకాలు ఇచ్చింది,

వాటిలో తుఫానుల గురించి, మెరుపులు ఇంకా ఉరుముల గురించి వివరాలు ఉండేవి,

ఇంకా మామూలుగా, “వాటి గురించి ఎంత తెలుసుకుంటే,

వాటి మీద అంత భయం తగ్గిపోతుంది” అని చెప్పేది.

ఇంకా అది నిజంగా నాకు సాయపడింది.

[చిన్నారి గోమెజ్] ఐ లవ్యూ.

-ఐ లవ్యూ. [ముద్దులు] -[టీవీలో మాటలు]

[గోమెజ్] జీవితంలో దేనికీ భయపడకూడదని మా అమ్మ ఎప్పుడూ నాకు నేర్పించేది.

-తను చాలా శక్తిమంతమైన స్ఫూర్తిని ఇచ్చేది. -[టీఫీ] నీ ముక్కు? నువ్వు తలుపుని గుద్దుకున్నావా?

[గోమెజ్] తను వయసులో చాలా చిన్నది, స్కూలుకెళ్లేది,

ఇంకా మనం ఊహించగలిగిన అన్ని ఉద్యోగాల్ని తను ప్రయత్నించింది.

[టీఫీ] బుజ్జీ.

“మనం ఈ పరిస్థితిని ఎదుర్కొంటున్నాం, కానీ నేను నా ప్రయత్నాన్ని ఆపను.

నేను ఆశ వదులుకోను. నా జీవితాన్ని ఇంతకన్నా బాగా మెరుగుపర్చుకుంటాను” అని చెప్పేది.

[టీఫీ] ఓహ్, ఇదిగో చూడు. “ఇంట్లోనే ఉండి పని చేయండి. రోజుకి 145 డాలర్లు.

మీ ప్రాంతంలో స్థానిక కంపెనీ వారి లేఖల్ని ప్రాసెస్ చేయడమే పని.”

-అవును. హేయ్, నేను ఆ పని చేయగలను. -[ముద్దుమాటలు]

[గోమెజ్] మా అమ్మ…

తను హైస్కూలులో ఉన్నప్పుడే నన్ను కనింది.

[ముద్దుగా మాట్లాడుతోంది]

డాడీ?

[గోమెజ్] నాకు అయిదేళ్ల వయస్సులో మా పేరెంట్స్ విడిపోయారు.

మా అమ్మ ఉద్యోగానికి వెళ్లినప్పుడు మా తాతయ్య, అమ్మమ్మ నన్ను చూసుకునే వారు.

…తాతయ్య గురించి నువ్వు పాడిన పాట ఏంటి?

[అస్పష్టంగా పాడుతోంది]

[ముద్దు ముద్దు మాటలతో, పాట పాడుతోంది]

[చిన్నారి గోమెజ్] హాయ్, నాన్నా.

[గోమెజ్] మా నాన్న మీద ఉండే ఒత్తిడిని నేను ఊహించలేను.

నేను చూశాను.

[గోమెజ్] ఆయన చాలా విషయాలలో బాధపడేవాడు,

ఇంకా తరచూ ఏం అనేవాడంటే, “సారీ, నా బుజ్జీ. నేను కేవలం…

నీతో ఎలా మాట్లాడాలో నాకు తెలియడం లేదు.” [ముక్కు ఎగబీల్చుకుంది]

కానీ నేను ఎలా అనుకునేలా చూసేవాడంటే,

నేను, అంటే, చాలా ముద్దొచ్చే చిన్నారి పాపని అనుకునే దాన్ని.

నేను ఏమైనా చేయగలిగే దాన్ని, ఇంకా ఎవ్వరూ నాకు సాటి రారు అనిపించేది, ఇంకా, అంటే… [ముక్కు ఎగబీల్చింది]

మరి, ఇప్పుడు ఆయనని నేను చాలా మిస్ అవుతున్నాను…

కానీ అది ఆయనకి కూడా తెలుసు, కాబట్టి…

తన ఫోటో తీసుకో, ఆ తరువాత మన ఫోటో తీసుకో, సరేనా?

-[టీఫీ] సరే, అక్కడికి వెళ్లు. -ఆగు, నేను వస్తున్నాను.

నేను ఫోటో తీస్తున్నాను.

[ఇద్దరూ] ఎప్పటికీ ఫ్రెండ్స్.

[టీఫీ] మేము చెప్పేది ఇంతేనా?

సరే. [గుసగుసగా అంటోంది]

[గోమెజ్] ప్రిసిల్లా నా కజిన్,

మా అమ్మ తరువాత నాకు అత్యంత సన్నిహితురాలు తనే.

మేము అన్నీ కలిసే చేసేవాళ్లం.

[ఇద్దరూ మాట్లాడుకుంటూ, నవ్వుతున్నారు]

ఈ రోజు వరకు కూడా, ఆమె నా ప్రాణం. తను నా కుటుంబం.

నిజానికి మనం ఎప్పుడూ చేయలేదు. కాబట్టి, మనం ఎప్పుడూ వాటి కోసం తిరిగి వెళ్లలేదు.

గ్రాండ్ ప్రెయిరీ

-[టీఫీ] ఎక్కడికి వెళ్తున్నాం? -తెలియదు…

-చికెన్ ఎక్స్ ప్రెస్ కి వెళదాం, తియ్యని టీ కోసం. -[టీఫీ] సరే.

[కాస్మీ] నీకు రోల్స్ ఇష్టమయితే, అక్కడ రోల్స్ కూడా ఉంటాయి.

లేదు, మనం… [చిన్నగా నవ్వింది] నాకు కేవలం స్వీట్ టీ కావాలి అంతే.

-[గోమెజ్] ఆగు, మనం మూడు తీసుకుందాం. -[కాస్మీ] మూడు, ఆహ్, లార్జ్ స్వీట్ టీలు…

-ఒక దాంట్లో ఎక్కువ ఐస్ వేయాలి. -[గోమెజ్] దయచేసి వేయండి, సర్?

[అటెండెంట్] అలాగే.

-నేను మాట్లాడుతుంటే నువ్వు అంత గట్టిగా మాట్లాడద్దు. -సరే, నువ్వు “దయచేసి” అనలేదు కదా.

నేను అదే అనబోతున్నాను.

[గోమెజ్] నేను ఎప్పుడు ఇంటికి వచ్చినా,

నాకు గుర్తున్న ప్రదేశాలకు ఎప్పుడూ వెళుతుంటాను.

ఎందుకంటే నాలో ఆ భాగాన్ని నేను ఎప్పుడూ వదులుకోలేను.

[డోర్ బెల్ రింగ్ అవుతోంది]

[ఫ్రెండ్] ఇక్కడికి కూడా వచ్చేదానివా?

-[డోర్ బెల్ రింగ్ అవుతోంది] -[స్పీకర్ లో రెసెప్షనిస్ట్ మాట్లాడుతోంది] బీప్!

-[రిసెప్షనిస్ట్ మాట్లాడుతోంది] -హాయ్…

మీరు ఈ భవనంలోకి రావాలంటే, ముందుగా నేను మీ డ్రైవింగ్ లైసెన్స్ చూడాలి.

-డ్రైవర్ లైసెన్సా? -అవును.

-సరే. -[ఫ్రెండ్] ఇదిగో. తీసుకో.

-బయట ఉన్న అందరిదీ కావాలి. -ఓహ్.

[చిన్నగా నవ్వుతూ] నా దగ్గర లైసెన్స్ లేదు.

సరే, వదిలేయండి. [తడబడుతూ] నా చిన్నప్పుడు నేను ఇక్కడికి వస్తుండే దాన్ని.

హమ్, నా పేరు సెలీనా, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలన్నది నా ఉద్దేశం కాదు, కానీ థాంక్యూ.

-సంతోషం. -ఉంటాను.

సరే, బై.

[ఫ్రెండ్] తను చేసింది.

[రిజిస్ట్రార్] మీరు…

ఎవరెవరికి డ్రైవింగ్ లైసెన్సులు ఉన్నాయి?

-అందరికీ. -[ఫ్రెండ్] ఒకటే ఉంది.

-[మింగుస్] తను ఇక్కడికి వచ్చేది… -ఇక్కడికి వచ్చేదాన్ని

-ఇది చూడాలని… -[రిజిస్ట్రార్] ఏం ఫర్వాలేదు.

[మింగస్] మీరు ఇక్కడ టీచర్ గా చేస్తున్నారా?

-[తడబడుతూ] నేను రిజిస్ట్రార్ ని. -ఓహ్, తెలిసింది.

కానీ… అంటే, నేను ఆఫీసులో పని చేస్తాను.

[ఆఫీస్ సిబ్బంది అరుస్తున్నారు]

[గోమెజ్] హాయ్, అందరికీ.

అందరూ నిశ్శబ్దంగా ఉండండి.

మీ ఆఫీసులో సాయం చేస్తారా? మీ వయస్సు ఎంత?

[అందరూ] పదమూడు.

[గోమెజ్] అది చాలా మంచి విషయం. నేను ఇక్కడ స్కూలులో చదివేదాన్ని అని మీకు తెలుసా?

-[అందరూ] అవును. -[గోమెజ్] మీకు తెలుసా?

సరే. నాకు కేవలం డైలన్ అల్వరాడో మీద మాత్రమే క్రష్ ఉండేది, హమ్…

ఎలిమెంటరీ స్కూలులో సామీ.

సరే. ఎలిమెంటరీలో సామీ రోడ్రిగేజ్ మీద ఇష్టం ఉండేది.

-ఆ తరువాత డైలన్ అల్వరాడో, కీత్ మౌపిన్… -కీత్.

ఎలై ఇక్కడే ఎక్కడో ఉండేవాడు.

హమ్. లేదు, అంత లేదు. నిజంగానా?

-అవును. -సరే.

ఆ తరువాత డానీ జోన్స్ నుండి మాథ్యూ.

అంతే.

వాళ్లలో ఎవ్వరూ నన్ను ఇష్టపడేవారు కాదు.

-కానీ, నీకు ముందే చెప్పాను, వాళ్లు పశ్చాత్తాపపడతారు. -అవును, నేను అదే అనబోతున్నాను. [చిన్నగా నవ్వింది]

[కాస్మి] తను ఎదిగే వయస్సులో, చాలా భిన్నంగా ఉండేది, తెలుసా?

ఎలాగంటే, స్కూలులో తను ఎక్కువమందితో పెద్దగా మాట్లాడేది కాదు.

తనకి, అంటే, ఆమెకి… ఇద్దరో ముగ్గురో ఫ్రెండ్స్ ఉండే వారు అంతే,

కానీ ఎక్కువమంది బాయ్ ఫ్రెండ్స్ ఉండేవారు కాదు, నా ఉద్దేశం ఏమిటో మీకు తెలిసే ఉంటుంది. [నవ్వింది]

ఇంకా నేను అక్కడ నుండి భోజనం తెచ్చుకునే దాన్ని,

ఇంకా సరిగ్గా ఇక్కడ, నేను ఈ పొడవు టేబుల్ మీద ఇలా కూర్చునే దాన్ని.

-కానీ మామూలుగా ఎప్పుడూ నేను ఒక్కదాన్నే కూర్చునే దాన్ని. -[ఫ్రెండ్] లేదు…

[స్టూడెంట్స్ పలకరిస్తున్నారు]

-హాయ్. నా పేరు… నా పేరు సెలీనా. -[విద్యార్థి] నిన్ను ఇదివరకు చూశాను.

మీరు ఏం చేయలేము అనుకుంటారో,

వద్దు అని చెప్పే అధికారం మీకు తప్ప ఇంకెవ్వరికీ లేదని గుర్తుంచుకోండి.

మీకు ఏం చేయాలని ఉంటే దానిని మీరు చేస్తూ ఉండండి.

-ఇప్పుడు ఇది స్ఫూర్తి ప్రసంగం అయింది. -సరే… ఓహ్, నేను…

-కదా? -బాగుంది. బాగుంది.

-[విద్యార్థుల చప్పట్లు] -సరే, అదరగొట్టండి, లేదా… ఓహ్, సారీ.

-[నవ్వుతున్నారు, గోల చేస్తున్నారు] -నువ్వు స్కూల్ అయిపోయాక కూడా ఉండాలి.

హలో, డానీ జోన్స్ మిడిల్ స్కూల్ విద్యార్థులు.

నేను సెలీనా గోమెజ్ ని మాట్లాడుతున్నాను.

మీ క్లాసులకు అంతరాయం కలిగించడానికి నన్ను అనుమతించినందుకు థాంక్యూ.

ఇంకా కేవలం… కేవలం గుర్తు చేస్తున్నాను, మీ టీచర్లు అంత చెడ్డ వాళ్లేమీ కారు.

మీరు చాలా కష్టపడి చదువుకోవాలి. [చిన్నగా నవ్వుతోంది]

మీరు అతడిని హగ్ చేసుకోవాలి. వాడు ఏడ్చేస్తాడు.

-[మొదటి విద్యార్థి] నాకు ఒక ఆటోగ్రాఫ్ ఇస్తారా? -అతను మీకు పెద్ద అభిమాని.

[రెండవ విద్యార్థి] ఓహ్, దేవుడా!

సంతోషం.

-నాకు కూడా ఒక హగ్ ఇస్తారా? -[మూడో విద్యార్థి] నాకు హగ్ ఇస్తారా?

[విద్యార్థుల అరుపులు]

-[గోమెజ్] ఇక్కడే… -[మింగస్] నాకు నిజంగా తెలియదు.

…నేను పెరిగాను.

అదే నా ఇల్లు.

-[మింగస్] ఇదా? -[గోమెజ్] అవును.

[మింగస్] నీ చేతి ముద్రలు ఇంకా ఇక్కడ ఉండే ఉంటాయి.

అదిగో సరిగ్గా అక్కడ…

పాపం మా పొరుగువాళ్లు, ఎందుకంటే ఎవడో ఒకడు అక్కడ డ్రగ్స్ అమ్మేవాడు, అదిగో, అదే,

ఇంకా మేము కిటికీల నుంచి చూసేవాళ్లం, ఎందుకంటే మమ్మల్ని బయటకి పంపేవారు కాదు.

-ఆ ఇంటి వాళ్లని చూస్తే జాలివేసేది… -[కాస్మి] అవును.

అతను అక్కడ కార్ పార్క్ చేసేవాడు, అది ఒక పాత కారు,

అక్కడ చెట్టు ఉండేది… [నాలుక చప్పరించింది]

-ఈ తలుపు అప్పటిదే. -ఓహ్.

హాయ్.

-[ఇంటి యజమాని] హాయ్. [చిన్నగా నవ్వాడు] -హాయ్, నా పేరు సెలీనా.

-ఎలా ఉన్నావు? -మీరు ఎలా ఉన్నారు?

-[ఇంటి యజమాని] బాగున్నా, బాగున్నా. లోపలికి రా. -ఏం అనుకోరుగా?

-[ఇంటి యజమాని] లేదు, ప్లీజ్. -సరే.

ఓహ్, దేవుడా.

సరే, ఇక్కడే నేను ఏం చేసేదాన్నంటే, హమ్,

-చేపల పొట్టు ఒలిచేదాన్ని, సరిగ్గా ఇక్కడే. -[మింగస్] చేపల పొట్టు తీయడం.

[గోమెజ్] అవును.

[టీఫీ] సెలీనా, ఆయన ఏం చేస్తున్నాడు?

దానికి రక్తం వచ్చేలా కోస్తున్నాడు.

-ఇంకా ఇది నా బెడ్ రూమ్. -[ఇంటి యజమాని] ఇది కొద్దిగా చిందరవందరగా ఉంది.

ఈ అల్మరాలో నేను గీసిన బొమ్మలు ఇంకా ఉన్నాయో లేదో నేను చూడచ్చా?

ఓహ్, వాళ్లు చెరిపేశారు.

-[కాస్మీ] అవి పోయాయా? -అవును.

చిన్నప్పుడు నాకు, అంటే… కోల్ ఇంకా డైలన్ స్ప్రౌస్ మీద క్రష్ ఉండేది,

దానితో నేను ఈ అల్మరాలోకి వచ్చి, నాకు నచ్చినవి రాస్తూ ఉండేదాన్ని.

-[కాస్మి] లేదు. -థాంక్యూ.

-ఇక్కడ ఏదో రాతలు ఉన్నాయి. -నిజంగానా?

నువ్వు నిజంగా కోల్ ని ప్రేమించావు అనుకుంటా.

-[కాస్మీ, ఇంటి యజమాని నవ్వుతున్నారు] -ఓహ్, దేవుడా! ఇంక ఆపండి. [ఎగశ్వాస పీల్చింది]

నా ఉద్దేశం… సారీ కోల్, నువ్వు ఎప్పుడైనా ఇది చూస్తే క్షమించు.

కోల్ స్ప్రౌస్ సెలీనా హార్ట్ కోల్

[కాస్మి] నేను, ఎడంగా పెట్టేదాన్ని…

-హమ్, క్రిస్టియానా? -చెప్పు?

ఇదిగో సరిగ్గా ఇక్కడ… మా అమ్మమ్మ మీకు ఆ ఫోటో చూపిస్తుంది.

తను ఫోటో తీస్తోంది. నేను అద్దంలో నన్ను నేను చూసుకుంటున్నాను.

అప్పుడే బార్నీలో నటించడం కోసం నన్ను తీసుకున్నారని తెలిసింది.

-[క్రిస్టియానా] ఓహ్, దేవుడా. -[కాస్మి] నువ్వు ఫోన్ మాట్లాడుతున్నావు.

నేను ఇక్కడ దిగిన ఫోటో ఒకటి ఉంది.

ప్రతీదీ చాలా అందంగా ఉంది, బార్నీ.

♪ ఆమె మళ్లీ వస్తుంటుంది… ♪

[గోమెజ్] నాకు మొదటి ఉద్యోగం వచ్చినప్పుడు నా వయస్సు ఏడేళ్లు.

నాకు గర్వంగా ఉండేది ఎందుకంటే నా జీవితాన్ని తప్పించుకుని బార్నీ ల్యాండ్ లో

ఆడుతూ పాడుతూ ఉండేదాన్ని కాబట్టి.

నాకు తెలియదు, నేను అలాంటి తప్పించుకుపోయే విషయాలని ఎక్కువ ఇష్టపడేదాన్ని.

ఇంక ఆ తరువాత నేను ఆగలేదు. నేను అలా కొనసాగుతూ వెళ్లాను.

నాకు పదకొండేళ్లు వచ్చేసరికి లాస్ ఏంజెలెస్ కి మారిపోయాను.

నాకు పని చేయాలని ఉండేది. నా ఉద్యోగాన్ని నేను ఇష్టపడేదాన్ని.

కానీ క్రమంగా, చాలా కాలం పాటు నేను ఈ పని చేశాక,

నాకు ఇదంతా వృథా అనిపించడం మొదలైంది.

ఎందుకో కానీ నేను ఒంటరిదాన్ని అనిపించేది.

తరువాత నేను టూర్స్ చేయడం మొదలయ్యాక, పరిస్థితి ఇంకా ఘోరం అయిపోయింది.

నేను చివరిసారి ట్రీట్మెంట్ సెంటర్ నుంచి బయటకు వచ్చాక,

నాకు సంతోషం కలిగించేవి అనుబంధాలే అని నాకు తెలిసింది.

ఇది జాయస్ ఇల్లు.

ప్రిసిల్లా, ఖచ్చితంగా ఇదేనా?

[కాస్మి] అవును. మా నాయనమ్మని అడగమంటావా?

ఆమె దగ్గర ఒక బొమ్మ ఇల్లు ఉండేది, నేను దాన్ని చాలా కోరుకునే దాన్ని.

[కాస్మి] దాని కోసమేనా ఆ ఇంటి ముందు వసారాలో మలాన్ని పెట్టావు?

-ఆపు. ఆ పని చేసింది చార్లీ. -[నవ్వుతున్నారు]

వాళ్లు ఎప్పుడూ ఆమెనే ఆటపట్టించేవాళ్లు.

హాయ్.

-హాయ్, నా పేరు సెలీనా. -చెప్పండి?

జాయస్… జాయస్ ఇక్కడ నివసించేప్పుడు నేను ఇక్కడికి వచ్చేదాన్ని.

-సెలీనా గోమెజ్? -అవును.

అవును.

అవును. [నవ్వుతోంది]

ఆమె ఇక్కడ ఉన్నారా?

అవును. తను, ఆహ్… లోపలికి వస్తారా?

-నిజంగానే అంటున్నారా? -అవును.

సరే.

మీ దగ్గర అది ఇంకా ఉందా…

-[కాస్మి] ఆ బొమ్మ ఇల్లు? -ఎవ్వరినీ… ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దు.

-[గోమెజ్ ఎగశ్వాస పీల్చింది] -జాయస్! ఎలా ఉన్నావు?

-ఓహ్, దేవుడా. హాయ్. కదలద్దు. -[జాయస్ భర్త] థాంక్యూ.

-[జాయస్] నేను లేవాలి. -[కాస్మి] ఆ బొమ్మ ఇల్లు అక్కడ ఉంది, సెలీనా.

హాయ్… అదే కదా… ఆ బొమ్మ ఇల్లు! వద్దు… లేవద్దు.

[జాయస్] నేను లేచి నిలబడలేను, బేబీ.

-[గోమెజ్] ఫర్వాలేదు. -నా బట్టతల నీకు ఎలా అనిపిస్తోంది?

అవును, కానీ, నువ్వు మంచిగా ఉన్నావు.

క్యాన్సర్ నుండి కోలుకున్నాను, కానీ, చూడు, ఈ ఏడాదిలో రెండుసార్లు నా మోకాళ్లు విరిగాయి.

-నేను… నేను లేవలేను. -అవును, ఇప్పుడు ఎలా ఉంది?

అం… అంటే, పెద్దగా ఏమీ లేదు.

హమ్, సారీ.

నా బొటనవేలు విరిగింది.

సరే ఇప్పుడు నీ ఆరోగ్యం ఎలా ఉంది?

[గోమెజ్] నా ఆరోగ్యం బాగుంది… బాగానే ఉంది. నా లూపస్ వ్యాధి నయం అవుతోంది.

-మంచిది. -అందుకు నేను చాలా సంతోషంగా ఉన్నాను.

రెండేళ్ల కిందట నాకు కిడ్నీ మార్పిడి జరిగింది,

కానీ ఇంతవరకూ అంతా సవ్యంగానే సాగుతోంది.

-సరే, మంచిది. -అవును.

-నేను రోజూ మందులు వాడుతున్నాను. -లూపస్ వ్యాధి మల్టిపుల్ స్లిరోసిస్ కి చెల్లెలు లాంటిది.

నిజంగానా? నాకు అది తెలియదు.

చాలా లక్షణాలు ఒకేలా ఉంటాయి. అది ఆటో ఇమ్యూన్… ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి.

-అవునా? -నా విషయాలు నీకు ఏం గుర్తున్నాయి?

నాకు గుర్తున్నాయి… [నిట్టూర్చింది] నాకు ఏం గుర్తుందంటే, నేను ఇక్కడికి వచ్చినప్పుడు,

నేను ఇంకా చార్లీ నిన్ను బాగా ఇబ్బంది పెట్టేవాళ్లం.

సరే. [చిన్నగా నవ్వింది] ఎవరో ఇక్కడ సొంతంగా నేరం ఒప్పుకుంటున్నారు.

అవును, అది నిజం. అందుకు నేను క్షమాపణలు చెప్పాలి…

నీకు ఇంకే విషయాలు గుర్తు లేవా?

లేదు, నాకు గుర్తున్నాయి. నువ్వు మమ్మల్ని లోపలికి రానిచ్చి,

బిస్కెట్లు పెట్టేదానివి, ఇంకా నేను నేరుగా ఇక్కడికి వెళ్లి, అలా…

నువ్వు నా బిస్కెట్ల గురించి చెబుతావనే నేను ఎదురుచూస్తున్నాను.

-ఓహ్, నాకు గుర్తుంది. మేము దానితో ఆడే వాళ్లం. -కుకీ లేడీ.

-ఇదివరకు చూసినప్పుడు అది ఇక్కడ ఉండేది కదా. -అక్కడే ఉండేది.

అది నిజం.

-[జాయస్ మాట్లాడుతోంది] -[గోమెజ్ నవ్వుతోంది]

ఓహ్, దేవుడా. నాకు ఇదంటే పిచ్చి, జాయస్.

-సరే, నిన్ను కలవడం సంతోషంగా ఉంది. -[జాయస్] నేను కూడా చాలా థ్రిల్ అయిపోయాను…

నువ్వు ఎప్పుడైనా వస్తే నన్ను చూడటానికి రమ్మని చెప్పమని నేను డెబ్బీని అడిగాను.

-నేను వచ్చినందుకు నాకు సంతోషంగా ఉంది. -నువ్వు వచ్చావు.

-హమ్…హమ్. -నేను అడిగే అవసరం లేదు.

లేదు.

[జాయస్] నువ్వు బలహీనంగా ఉన్నావు.

[గోమెజ్] ఓహ్, ఫర్వాలేదు. మన అందరం కోలుకుంటాం.

-చాలా థాంక్స్. -ఈ రోజు నీకు గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను.

-నీ కోసం ప్రార్థిస్తుంటాను. -అలాగే, థాంక్యూ.

[కాస్మి] ఉంటాను, జాయస్.

-బై, సెలీనా. -[గోమెజ్] బై. చాలా థాంక్స్.

-[కెమెరాపర్సన్] థాంక్యూ. -[గోమెజ్] నిన్ను కలవడం సంతోషంగా ఉంది.

[కెమెరాపర్సన్] అందరికీ, థాంక్యూ.

[జాయస్ మాట్లాడుతోంది]

[గోమెజ్ నవ్వుతూ] నేను చేస్తాను.

[నిట్టూర్చింది]

నాకు లూపస్ వ్యాధి వచ్చినప్పుడు, చాలా భయపడ్డాను.

తరువాత దాని నుంచి కోలుకుని అప్పుడు అనుకున్నాను,

“నాకు నయం అయింది కాబట్టి నేను వెళ్లి, వీళ్లందరినీ పలకరించాలి.”

హాయ్, బేబీ.

ఆ తరువాత నాకు కిడ్నీ మార్పిడి జరిగింది, ఇంకా మేము చాలా కష్టపడ్డాము.

అయితే అది తరువాత మానసిక సమస్యగా మారినప్పుడు,

నాకు నేను చెప్పుకున్న విషయం ఇదే, “ఇప్పుడు ఈ జనంతో నన్ను పోల్చుకోగలను” అని.

-ఏదైనా ఒక కారణం లేనిదే ఏదీ జరగదు అనుకుంటా. -అలాగే. బై, అందరికీ.

[గోమెజ్] నువ్వు నీలాగే ఉండు, సెలీనా.

ప్రయత్నించడం ఆపు.

నువ్వు ఏం చేస్తున్నావన్నది ఎవ్వరూ పట్టించుకోరు.

ఇది నేను ఎవరన్న దాని గురించి. నేను ఉన్న స్థాయితో నేను సంతృప్తిగా ఉండటం గురించి.

నా కుటుంబానికి నేను కృతజ్ఞత కలిగి ఉంటాను.

నా స్నేహితుల పట్ల కృతజ్ఞత కలిగి ఉంటాను.

నేను జీవించి ఉన్నందుకు కృతజ్ఞత కలిగి ఉంటాను.

నేను రాసిన మరో మూడు పేరాలను దీనికి జోడిస్తున్నాను.

“మనం నిజం చెప్పినప్పుడు మనకి హాయిగా ఉంటుంది అనుకుంటా,

-కాబట్టి మళ్లీ, నేను నిజం చెబుతున్నాను.” -[రైట్] సరే.

“నేను మానసికంగా, భావోద్వేగాల కారణంగా చాలా బాధ అనుభవించాను,

అందువల్ల నేను స్థిరంగా, స్థయిర్యంగా వ్యవహరించలేకపోయాను.

నా బాధ, ఆందోళన, భయం ఒక్కసారిగా నన్ను చుట్టుముట్టినట్లు అనిపించేది,

నా జీవితంలో నేను తీవ్రంగా భయపడిన క్షణాలు అవి.

సరిగ్గా ఆ రోజు… నాకు బైపోలార్ డిజార్డర్ ఉందని తెలిసింది.”

[రైట్] నీకు బైపోలార్ ఉందని నువ్వు చెప్పాలని ఎవ్వరూ కోరుకోరు.

నీ వయస్సు ఇరవై ఏడేళ్లు,

ఆ విషయాన్ని ఈ ప్రపంచానికి చెప్పడానికి నీకు జీవితకాలం సమయం ఉంది,

నువ్వు దీనిని ఇప్పుడే చెప్పాలని గట్టిగా సంకల్పించుకుంటే తప్ప.

-సరే. -ఎవ్వరూ… ఎవ్వరూ దానికి వ్యతిరేకంగా లేరు.

ఇది ఎలా అవుతుందంటే, అదే ప్రధాన విషయంగా మారిపోతుంది.

దాని అర్థం, అంటే… ఏంటి?

అంటే, కొంతమంది జనం లేదా డైరెక్టర్లు లేదా సంస్థలు ఏమైనా నాతో కలిసి పని చేయవా?

అలాంటప్పుడు వాళ్లతో కలిసి నేనయినా ఎందుకు పని చేస్తాను?

-[మారినో] నిజం. నువ్వు ఆలోచించేది సరైనదే. -నేను ఈ మాట చెప్పబోతున్నాను.

-[మారినో] అలాగే. -నేను ఇది చెబుతాను. మరేం ఫర్వాలేదు.

-ఇంక ఇదే తుది నిర్ణయం. -[రైట్] ఇలా చెప్పు… సరే.

[రేడియో వ్యాఖ్యాత] సెలీనా గోమెజ్ సరదాగా ముచ్చటిస్తూ…

బోస్టన్

-…ఆమె పోరాటం గురించి… -[రెండో రేడియో వ్యాఖ్యాత] …ఆ స్టార్

డిప్రెషన్ ఇంకా యాంగ్జయిటీలతో తను వ్యక్తిగతంగా ఎలా పోరాటం చేసింది తెలియజేశారు,

ఇంకా ఆ ప్రయాణం ఎలా సాగిందో ఆమె చెప్పారు…

[మూలుగుతోంది] నాకు ఇరవై నిమిషాల టైమ్ ఉందా?

-[కెమెరాపర్సన్] నువ్వు నెర్వస్ గా ఫీల్ అవుతున్నావా? -[మూలుగుతూ] నా ఆరోగ్యం బాగాలేదు.

[రైట్] ఇది నెర్వస్ సమస్యా?

[గోమెజ్] నాకు ఒంట్లో అస్సలు బాగాలేదు.

-[ఫ్రెండ్] తనకి ఆకలిగా ఉందా? -[గోమెజ్] చాలా అసౌకర్యంగా ఉంది.

-[రైట్] ఏంటి? -ఏం జరిగింది?

టెన్షన్ కావచ్చు.

అది అయి ఉంటుంది.

అది ఏం చేస్తుంది?

-అనారోగ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది. -నీరసపరుస్తుంది.

అవును.

హాయ్, రఖేల్.

[స్టివెన్స్] హలో, సెలీనా.

[రైట్] రఖేల్, ఇది చాలా ముద్దుగా ఉంది. ఇది మొత్తం ఒకే పీస్ డ్రెస్సా, లేక రెండు పీసుల డ్రెస్సా?

[స్టివెన్స్] లేదు. ఇది… ఇది చాలా క్రేజీగా ఉంది…

[ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు]

[వ్యాఖ్యాత] మీ అందరికీ గొప్ప సంతోషంతో

మెక్ లీన్ సైకియాట్రిక్ హాస్పిటల్ వార్షిక విందుకి స్వాగతం పలుకుతున్నాం.

హాయ్, మిత్రులారా. హమ్, ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది,

నేను కొద్దిగా ఇబ్బందికరంగా మాట్లాడచ్చు అందుకు సారీ చెబుతున్నాను. [నవ్వింది]

హమ్, అవును, నాకు ఏడేళ్ల వయస్సు అప్పుడే, హమ్… నేను పని చేయడం మొదలుపెట్టాను,

తరువాత నేను నా పాత్ర ఎలా పోషించాలో చాలా త్వరగా నేర్చుకున్నాను.

అటు నా షూటింగ్ పనులు, ఇంకా స్కూలు వర్క్, ఇంకా నా సంబంధాల్ని

నాకు గుర్తున్నంత వరకూ నేను సక్రమంగా నిర్వహించుకున్నాను.

జీవితం ఎంత గొప్పదయినా, అన్నింటి వెనుక, నేను పోరాడుతున్నాను.

కిందటి ఏడాది, నేను, హమ్… నేను మా…మానసికంగా ఇంకా భావోద్వేగాలపరంగా బాధపడ్డాను,

అందువల్ల నేను స్థిరంగా ఇంకా స్థయిర్యంగా వ్యవహరించలేకపోయాను.

నాకు సహాయం అవసరమైంది,

అప్పుడు డాక్టర్లు నాకు స్పష్టమైన డయాగ్నోసిస్ చేయగలిగారు.

నాకు ఆ విషయం తెలిసిన మరుక్షణం,

కొన్ని సంవత్సరాలుగా నేను డిప్రెషన్ ఇంకా యాంగ్జయిటీతో నేను ఎందుకు బాధపడ్డానో

నాకు చివరికి తెలిసి వచ్చింది.

ఇక ఈ రుగ్మతలని నేరుగా ఎదుర్కోవడం ప్రారంభించాను,

ఎందుకంటే నా చిన్నతనంలో నా భయాలను, సవాళ్లను ఎలా ఎదుర్కోవాలో నాకు మా అమ్మ నేర్పింది.

నేను మరింత సంతోషంగా, మరింత ఆరోగ్యంగా మారాను,

ఇక ఇప్పుడు నా భావోద్వేగాలు ఇంకా నా ఆలోచనలు గతంలో కన్నా ఎక్కువగా నా అదుపులోకి వచ్చాయి.

-కాబట్టి ఆ విషయంలో నేను చాలా సంతోషంగా ఉన్నాను. థాంక్స్. -[ప్రేక్షకులు చప్పట్లు కొడుతున్నారు]

[చిన్నగా నవ్వుతోంది]

నిజానికి ఇది బయటకి చెప్పడమే బాగా అనిపిస్తోంది, ఎందుకంటే ఇది నిజం, తెలుసా?

అంటే, చాలా సంవత్సరాలు, నేను బహుశా ఇది చెప్పాలి అనుకున్నాను,

కానీ ఈసారి ఆ వాస్తవాన్ని మీతో పంచుకోవడం నిజంగా చాలా గొప్పగా అనిపిస్తోంది.

హమ్, కొన్నిసార్లు నా సొంత ఆలోచనలు, ఫీలింగ్స్ తో నేను కూడా బాధపడేదాన్ని,

కానీ దాని వల్ల నేను తప్పు చేశానని అనుకోవడం లేదు.

అది నన్ను బలహీనపర్చలేదు.

అది నన్ను తక్కువ చేయలేదు.

అది నన్ను మనిషిని చేసింది.

నా జీవితం కూడా అలాగే ఉండేది కానీ ఇప్పుడు ఆ విషయాన్ని నువ్వు వెలుగులోకి తెచ్చి…

ఎవరో ఒకరు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి చెప్పకపోతే,

నిజమైన మార్పు ఎప్పటికీ రాదు.

నేను హృదయపూర్వకంగా చెబుతున్నాను, నీ ధైర్యం అసమానం,

అలాగే నువ్వు… నువ్వు కొందరి ప్రాణాలు కాపాడుతున్నావు. నువ్వు కొన్ని ప్రాణాల్ని కాపాడుతున్నావు,

-అందుకే నువ్వు చేస్తున్న పనికి థాంక్యూ. -వావ్, నేను కేవలం ఈ చర్చలో భాగం మాత్రమే…

నేను కేవలం ఈ చర్చలో భాగం మాత్రమే, తెలుసా?

పూర్తిగా, థాంక్యూ. ఇది నాకు గొప్ప గౌరవం.

అందరి ప్రాణాల్నీ కాపాడేది మీరు, కానీ నేను నా వంతు సాయం అందిస్తున్నాను అంతే,

-ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. -థాంక్యూ.

మానసిక రుగ్మతల గురించి, డిప్రెషన్, యాంగ్జయిటీ గురించి నువ్వు అయినా కూడా, అంటే, ఇలా

-బహిరంగంగా మాట్లాడటం గొప్ప… -అవును.

నేను, స్వయంగా, మూడేళ్ల కిందట అక్టోబర్ లో ఒకసారి ప్రయత్నించాను,

ఇంకా నాకు అది గుర్తుంది… ఓహ్, చాలా థాంక్స్. [చిన్నగా నవ్వింది]

[గోమెజ్] ఆ రాత్రి నిజాయితీగా ఉండటం మేలు అయింది.

నేను నా రచనా భాగస్వామి జూలియా మైఖేల్స్ కి ఇంకా జస్టిన్ ట్రాంటర్ కి సందేశం పంపి

“నేను విచారంతో ఉన్నానని చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను అనుకుంటా” అని చెప్పాను.

మేము ఆ పాటని 45 నిమిషాల్లో రాశాము. నేను అతి వేగంగా రాసిన పాట ఇదే.

అది భగ్న ప్రేమకు మించిన విషయం గురించి. నన్ను నేను ఎంచుకోవడం నేర్చుకోవడం గురించి ఆ పాట రాశా.

జీవితాన్ని ఎంచుకోవడం గురించి.

[“లూజ్ యూ టు లవ్ మీ” పాట పియానో మీద ప్లే అవుతోంది]

కానీ అందులో కూడా జనం కరుణని, శాంతిని పొందుతారని ఆశిస్తున్నాను.

♪ నువ్వు నాకు ఈ ప్రపంచాన్ని ఇస్తానని ప్రమాణం చేశావు దానికి నేను పడిపోయాను ♪

♪ నిన్నే నేను ముందు ఉంచాను దానిని నువ్వు ఆరాధించావు ♪

-[ఏడుస్తూ] డాడీ. -♪ నాకు విలువైనవన్నీ దహించి వేశావు ♪

♪ అది దగ్ధమయ్యేలా చేశావు నా బృందగానంలో అపశృతితో పాడావు ♪

♪ ఎందుకంటే అది నీది కాదు ♪

♪ నేను ఆ సంకేతాల్ని గమనించాను కానీ వాటిని విస్మరించాను ♪

-[పాట కొనసాగుతోంది] -ఈ పాట దేని గురించి అంటే

నీలోని ప్రతి భాగం నువ్వు ఎవరన్నది కోల్పోవడం గురించి.

♪ నా ప్రయోజనం కోసం మంటలు రేపావు ♪

మనల్ని మనం మళ్లీ తెలుసుకోవడం గురించి.

♪ నన్ను బాధించడాన్ని నువ్వు ఆనందంగా ఆస్వాదించావు అది నీది కాదు కదా, అవును ♪

[రిపోర్టర్లు అరుస్తున్నారు]

[రిపోర్టర్] జస్టిన్ తో ఇంకా ప్రేమలో ఉన్నారా?

[గోమెజ్] ప్రతి విషయం పబ్లిక్ అయిపోయింది.

[మీడియా ప్రతినిధి] బీబర్ ఎంగేజ్మెంట్ గురించి ఏమైనా స్పందిస్తారా, సెలీనా?

[రెండవ మీడియా ప్రతినిధి] బీబర్ లో మీకు నచ్చే గుణం ఏంటి?

దయచేసి, నేను అందులోకి వెళ్లచ్చా… తినడానికి? మీరు ఆగుతారా… నాకు ఏదైనా తినాలని ఉంది.

గతంలోని ప్రేమబంధం గురించి అందరూ నన్ను వెంటాడుతుంటారు, దాన్ని ఎవ్వరూ జీర్ణించుకోలేకపోతున్నారు.

కానీ నేను దానిని దాటి ముందుకు సాగిపోయాను.

ఇంక ఇప్పుడు నాకు ఏ భయమూ లేదు.

-అందరికీ థాంక్స్, బై, ఫ్రెండ్స్! -[టీమ్ సభ్యుడు] సరే, చూడండి. ఇక హమ్,

-ఇంక కెమెరాలు ఆపేయండి. -థాంక్యూ.

[గోల చేస్తున్నారు]

“సెలీనా గోమెజ్ ఇప్పుడు మొదటిసారి ప్రవేశంతోనే

బిల్ బోర్డ్ హాట్ 100లో టాప్ ట్వంటీ లో నిలుస్తోంది.

దీనితో ఆమె ఇంకా అడెలీ మాత్రమే అతి పెద్ద బాలాడ్ డెబ్యూని సాధించిన మహిళలుగా

-చరిత్ర సృష్టించబోతున్నారు” అని ఇది చెబుతోంది. -[మింగస్] అవును.

-[స్టివెన్స్] అవును. -నాకు ఏడవాలని ఉంది.

[అభిమానులు అరుస్తున్నారు]

-నీ పాటల్లో ఇదే అతిపెద్ద హిట్ పాటనా? -అవును, ఇదే పెద్దది.

-ఇది నీ అతి పెద్ద హిట్ కొట్టిన పాట, కదా? -[ప్రేక్షకుల కేరింతలు]

[గోమెజ్] నేను వీలైనంత నిజాయితీగా ఉండాలి అనుకున్నాను,

ఇంకా నేను జనానికి సంతోషం కలిగించే స్థాయిలో ఉన్నందుకు

నాకు నేను అదృష్టవంతురాలిగా భావిస్తాను.

అతి ఘోరమైన భగ్నప్రేమని ఎదుర్కొన్నానని నేను అనుకుంటూ ఉంటాను,

ఆ తరువాత అన్నింటికీ మించి దానిని పూర్తిగా మర్చిపోవడం ఇంకా కష్టమైంది అనిపిస్తుంది.

అది… అది నిజంగా చాలా గందరగోళంగా ఉంటుంది, కానీ అది జరగడమే మంచిది అని ఊరుకుంటాను.

కానీ చివరికి నా జీవితంలో జరిగిన అతి గొప్ప విషయం అదే.

[జానిక్] అయితే చివరిగా, నీ సందేశం ఏమిటంటే…

నా జీవితంలో జరిగిన అతి గొప్ప విషయం అదే అని నేను చెప్పింది నీకు వినిపించలేదు కదా.

-[జానిక్] సారీ. -నువ్వు మాట్లాడటం మొదలుపెట్టావు.

-నేను ఇంకోసారి చెప్పలేను. -[జానిక్] ఇంకొక్కసారి చెప్పు.

లేదు.

సరే. నన్ను ఏం అడగాలి అనుకుంటున్నావు?

[జానిక్] నేను కేవలం… నీ జీవితంలో జరిగిన మంచి సంఘటన అదేనా?

[నవ్వుతోంది]

నా జీవితంలో జరిగిన అతి మంచి సంఘటన అదే, నిజం.

అయితే, నీ ఆల్బమ్ ఎప్పుడు విడుదల చేయాలి అనుకుంటున్నావు?

-జనవరి. -[జానిక్] సరే, మంచిది.

నువ్వు వెళ్లాలి అనుకుంటున్నావా, ఏమైనా సమస్యలు ఉన్నాయా,

-అవి నాకు తెలియాలి, లేదా అది… -నేను కెన్యా ఇంకా లండన్ వెళ్లాలి.

-సరే. -[చిన్నగా నవ్వుతున్నాడు]

అది ఆరు వారాల పాటు సరదాగా సాగుతుంది.

ఈ ఏడాది ఎఎమ్ఎ వేడుకలో నువ్వు ప్రదర్శన ఇవ్వాలి అనుకుంటున్నావా?

అవును.

ఇంకా, హమ్, సరే.

-అయితే మనం ఇలా చేయాలి అనుకుంటే… -నేను అనుకుంటున్నా.

-…మేము వెంటనే పనుల్లోకి దిగాలి. -మంచిది.

-సరే. -[నిట్టూర్చింది] నా కడుపులో ఏదో తేడాగా ఉంది.

-[మోర్గన్రోత్] నీకు ఆకలిగా ఉందా? -లేదు.

-[మోర్గన్రోత్] నువ్వు బాగానే ఉన్నావా? -అవును, అది నెర్వ్స్ సమస్య అనుకుంటా.

ఇక్కడ చాలా చలిగా ఉంది. నీకు స్వెటర్ కావాలా?

-నాకు చాలా వేడిగా ఉంది. -నీకు వేడిగానా? సరే.

-సరే, అయితే నువ్వు సరైన గదిలోనే ఉన్నావు. -అవును.

-ఈ గది అమెజాన్ అడవిలా అనిపిస్తోంది. -ఇగ్లూ మాదిరిగా ఉంది.

ఇక్కడ ఇది ఇగ్లూనే.

-మీరందరూ నన్ను తిట్టుకుంటారేమో, కానీ… -సరే, మనం మళ్లీ మొదటి నుంచి వద్దాం.

-మీరందరూ నన్ను తిట్టుకోవచ్చు, కానీ నేను వెళ్లాలి. -సరే.

-నాకు ఏదోలా అనిపిస్తోంది… అవును. ఓహ్. -నువ్వు బాగానే ఉన్నావా? సారీ.

[మోర్గన్రోత్] ఈ మీటింగ్ వల్ల ఏర్పడిన ఒత్తిడి అనుకుంటా.

[టూర్ సభ్యురాలు] హమ్, అదే అనుకుంటా.

-[రెండో టూర్ సభ్యుడు] నేను కూడా. -సరే.

[మూడో సభ్యుడు నవ్వుతూ] అవును.

[గోమెజ్] నేను స్టేజ్ మీద ప్రదర్శన ఇచ్చి రెండు సంవత్సరాలు దాటింది,

కానీ నేను ఇంకా రెడీగా ఉన్నానో లేదో నాకు తెలియదు.

పాట ఉంటే ఏం లాభం దానిని నేను పాడటానికి భయపడుతున్నప్పుడు?

ఎఎమ్ఎ ప్రదర్శన తరువాత నేను నేరుగా కెన్యా వెళ్లాను.

నా కిడ్నీ మార్పిడి కారణంగా కొన్ని సంవత్సరాలుగా నా డాక్టర్లు నన్ను వెళ్లనివ్వలేదు,

కానీ మొత్తానికి నేను తయారుగా ఉన్నాను.

సరే, రఖేల్ ఇంకా నేను అక్కడ ఒక ప్రైమరీ స్కూల్ లో విద్యార్థుల్ని కలుస్తాము,

ఇంకా యువతుల కాలేజీని సందర్శిస్తాము.

వి చారిటీలో భాగంగా కెన్యాలో ఈ రెండు విద్యాసంస్థల నిర్మాణానికి నిధులు సేకరించడానికి నేను సాయం చేశాను.

అది చాలా ప్రయాసతో కూడినదని నాకు తెలుసు,

కానీ నా ఆల్బమ్ విడుదల కావడానికి ముందు నేను వెళ్లడానికి ఇప్పుడు మాత్రమే అవకాశం ఉంది.

[అరుస్తోంది]

-అంతే. అంతే. -అయిపోయిందా?

-అంతే, అవును. శభాష్. -[ఎగశ్వాస పీలుస్తోంది]

-సరే. -[నర్స్] దీర్ఘంగా లోపలికి, బయటకి శ్వాస పీల్చు.

[నర్స్ చిన్నగా నవ్వింది]

[స్టివెన్స్] ఓహ్! హాయ్, బేబీ!

-[గోమెజ్] నువ్వు చేశావా? -అవును.

-మంచి పని. -నేను ఊరికే అలా పడుకుని ఉన్నాను.

నీకు నొప్పిగా ఉందా?

అవును, నా చెయ్యి బలహీనంగా అనిపిస్తోంది.

ఓహ్, దేవుడా.

-నేను ఎంత బాధ అనుభవించానో ఇప్పుడు నీకు తెలుస్తుంది. -నాకు తెలుసు. నాకన్నా ఎక్కువ బాధ నువ్వే అనుభవించావు.

“నిజానికి, లేదు, నీకు తెలియదు” అందాం అనబోతున్నాను.

[చిన్నగా నవ్వుతోంది]

-అయినా, నిన్ను చూసి గర్వపడుతున్నాను. -థాంక్యూ.

[రిపోర్టర్] ఎఎమ్ఎ వేదిక మీద సెలీనా గోమెజ్ భారీ అంచనాల మధ్య మళ్లీ ప్రదర్శన ఇచ్చారు.

ఇది ఆమె తొలి ప్రదర్శన…

ప్రదర్శనకు ఒక రోజు ముందు

…గత రెండు సంవత్సరాలలో,

బీబర్ డ్రామా అంతా జరగడం ఇంకా ఆమె కొంతకాలం మీడియాకి దూరంగా ఉన్న తరువాత.

♪ ఆ సంకేతాలు గమనించాను కానీ వాటిని విస్మరించాను ♪

♪ గులాబీ రంగు అద్దాలలో తప్పుడు దృశ్యాలు ♪

♪ నా అడవికి మంటలు అంటించావు… ♪

[మూలుగుతోంది]

[కోచ్] ఆ స్థాయి… ఆ స్థాయి దగ్గర గొంతు వణుకుతోంది.

కాబట్టి ఆ మజిల్ మెమరీని నువ్వు అలా వదిలేసి,

నువ్వు ఎక్కువ ఆలోచించకుండా ఉంటే, అంతా చాలా సునాయాసంగా అయిపోతుంది.

నిన్ను నువ్వు విశ్వసించాలి.

సెల్, మనం ఇప్పుడు మరొక పాట పాడబోతున్నాం.

-ఇది మనం పాడాలి. -సరే.

అందుకో.

-విజృంభించు! -ఇది నా పాట కాదు.

నాకు ఈ పాట అంతా కనీసం గుర్తు కూడా లేదు.

ఎవరు పట్టించుకుంటారు? నీకు ఏం తెలిస్తే అదే పాడు.

[లౌరెన్ డైగల్, గోమెజ్] ♪ నా బుర్రలో ఏవో గొంతులతో నేను పోరాడుతున్నాను ♪

♪ నాకు అర్హత లేదని అవి అంటున్నాయి ♪

కానివ్వు!

♪ ప్రతి ఒక్క అబద్ధం నాకు చెబుతుంది ♪

♪ నేను ఆ అర్హతని అందుకోలేనని ♪

[నిట్టూర్చింది]

దేవుడా నన్ను కాపాడు.

[ప్రేక్షకులు గోల చేస్తున్నారు]

[“లూజ్ యూ టు లవ్ మీ” పాట ప్లే అవుతోంది]

♪ నువ్వు నాకు ప్రపంచాన్ని ఇస్తానని ప్రమాణం చేశావు దానికి నేను పడిపోయాను ♪

♪ నిన్నే నేను ముందు ఉంచాను అది నీకు నచ్చింది ♪

♪ నా ఇష్టాలను నువ్వు దగ్ధం చేశావు ♪

♪ అది దగ్ధమయ్యేలా నేను వదిలేశాను నా కోరస్ లో అపశృతి పాడావు ♪

♪ ఎందుకంటే అది నీకు కాదు ♪

[రిపోర్టర్] సెలీనా గోమెజ్ ఈ ప్రదర్శనకు ముందు భయంతో కుంగిపోయింది…

[రెండవ రిపోర్టర్] ఆమె పాటలో అపశృతులు ఉన్నాయని…

[మూడో రిపోర్టర్] గోమెజ్ తన పదేళ్ల కెరీర్ లో

ఎలా పాడాలో నేర్చుకోలేదు, కానీ కోట్ల రూపాయలను గడించింది.

[నాలుగో రిపోర్టర్] …గత నాలుగేళ్లలో. కానీ యాంగ్జయిటీ, ఊరికే అలా మాయమైపోదు.

వాస్తవంగా, తన లూపస్ వ్యాధి వల్ల యాంగ్జయిటీ పెరుగుతోందని ఆమె చెబుతోంది.

[టీఫీ] హాయ్. తను మేల్కొంది.

-[స్టివెన్స్] హాయ్. -[గోమెజ్] హాయ్.

[స్టివెన్స్] ఆహ్. ఎలా నడుస్తోంది?

[ఫ్రెండ్] హేయ్, సర్ విన్నీ. [ముద్దాడుతోంది]

నీకు కొద్దిగా సూప్ తీసుకువస్తాను, హమ్… [అస్పష్టంగా మాట్లాడుతోంది] …కొద్దిగా,

అలాగే హామ్ ఇంకా చీజ్ తెస్తాను.

[మింగస్] కెన్యా తరువాత నువ్వు లండన్ ప్రోమో ఎప్పుడు చేస్తావని అలీన్ నన్ను అడిగింది,

కెన్యాలో నువ్వు మూడు రోజులు ఉంటావు కదా.

ఇంకా ఒక రోజు పారిస్ లో పర్యటించిన తరువాత… ఇంటికి రాగలవా అని నన్ను అడిగింది.

-నువ్వు కూడా నాతో వస్తున్నావా, రఖేల్? -[స్టివెన్స్] వస్తున్నాను.

సరే.

[మింగస్] అవునా? అది చాలా ఎక్కువ అనిపించడం లేదా?

హమ్, లేదు, అలాగని దాన్ని హడావుడిగా చేయాలని కూడా నాకు లేదు.

నేను ప్రోమో చేసి కొన్ని ఏళ్లు అయింది.

నాకు అస్సలు ఇష్టం లేని పనుల్లో అదొకటి.

[స్టివెన్స్] కానీ అది గొప్పగా ఉంటుందని నాకు అనిపిస్తోంది,

ఎందుకంటే నువ్వు విడుదల చేస్తున్న పాట గురించి నువ్వు ఉత్సాహంగా ఉన్నావు కాబట్టి…

-[గోమెజ్] హమ్. -…అది నీ ఆలోచనలకు దగ్గరగా ఉంది కాబట్టి.

నాకు పని గురించి ఇంక మాట్లాడాలని లేదు.

-[స్టివెన్స్] సరే. -ఏదైనా సినిమా చూద్దాం.

నాకు కాస్త బ్రేక్ కావాలి.

[ఫ్రెండ్] అన్నింటి నుంచా?

హమ్…హమ్, లేదు. నేను చేయాల్సిన పని చాలా ఉంది.

హంటర్, నువ్వు నడిచి ముందుగా లోపలికి వెళతావా…

[జానిక్] నీ క్యాలెండర్ గురించి నువ్వు పెద్దగా పట్టించుకోవు అని నాకు తెలుసు, కానీ నువ్వు ఆఫ్రికా వెళ్తున్నావు.

అవును, నేను మొదట కెన్యా వెళ్లి,

తరువాత నేను నేరుగా లండన్, అటునుంచి ప్రోమో కోసం పారిస్ వెళ్తున్నాను.

సరే. వచ్చే నెల వరకూ మనం అనుకున్న ప్రతీదీ పూర్తి చేయడానికి

-నీకు ఇబ్బంది లేదు కదా? -హమ్…హమ్. లేదు.

ఏమీ ఆందోళన లేదు.

[జానిక్] అయితే మనం పూర్తిగా వీడియో, ప్రచారం, పాట గురించి పనిచేస్తాం.

హమ్…హమ్.

-[ఎయిర్ పోర్ట్ అధికారి] మీ బ్యాగులలో కంప్యూటర్స్ లేవా… -లేవు. మా షూస్ కూడా తీసేయాలా?

-[ఎయిర్ పోర్ట్ అధికారి] అవును. -సరే.

వెళదాం పద. వూహూ! వూ… హూ!

మాసై మారా, కెన్యా

-వూహూ! -థాంక్యూ.

స్వాగతం.

-ఇది మాకు ఆశీర్వాదం అని కూడా అంటాం. -ఏంటి?

వాన పడితే, దానిని ఆశీర్వాదం అంటాం.

-ఇది ఆశీర్వాదమా? -అవును.

ఇక్కడ వర్షం పడితే, అది దేవుని ఆశీర్వాదం అని భావిస్తాం.

-[స్టివెన్స్] ఓహ్, ఇది నాకు నచ్చింది. -ఊహ్! వోహ్! [చిన్నగా నవ్వుతోంది]

[గైడ్] ఇది తీసుకోండి. ఇప్పుడు అది వేసుకోవచ్చు. కెమెరా ఉన్నా మీకు ఫర్వాలేదా?

-ఫర్వాలేదు. -[గైడ్] బాగుంది… మీకు సరిపోయిందా?

-అందరికీ, హలో. -[విద్యార్థి] హలో.

-హాయ్, నీ పేరు ఏంటి? -అనీసియా.

-అనీసియా? నా పేరు సెలీనా, నిన్ను కలవడం సంతోషం. -అవును.

హలో. నా పేరు సెలీనా. హమ్, నేను ఇక్కడికి వీ సంస్థతో కలిసి వచ్చాను,

ఇంకా విద్యని అందించాలన్న మీ తపనని అభినందించాలి అనుకుంటున్నాను.

కాబట్టి, నాకు… నాకు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది.

[అనీసియా] అయితే మీరు ఏ గ్రేడ్ వరకూ చదివారు? మీరు పన్నెండో గ్రేడ్ పూర్తి చేశారా?

-ఆహ్, నేను ఎనిమిదో గ్రేడ్ పూర్తి చేశాను… -హమ్…హమ్.

…ఇంకా తరువాత తొమ్మిది, పది, పదకొండు, పన్నెండు, నేను సెట్స్ లోనే పాఠాలు చదువుకున్నాను.

ఎంత… అంటే, అయిదు గంటలు చదివి తరువాత నేను షూటింగ్ పనులు చేసేదాన్ని, కాబట్టి…

హమ్…హమ్. వావ్.

సరే, అది… అది ఆసక్తిగా ఉండేది, తెలుసా?

ఒక కంప్యూటర్ ద్వారా ఇంట్లోనే చదువుకోవడం. అది నిజమైనది కాదు…

[విద్యార్థి] వావ్.

…కానీ అది… అది నాకు గొప్పగా అనిపించేది. అది పనిచేసింది, తెలుసా?

[అనీసియా] కిందటి సంవత్సరం, మేము టాలెంట్ గ్రూప్ నిర్వహించాం,

అప్పుడు మీ పాట పాడేవాళ్లం, అంటే, మీ పాట. అది…

♪ ఎవరు అన్నారు నువ్వు చక్కగా ఉండవని ♪

-[నవ్వుతోంది] -[గోమెజ్] ఓహ్, అది నా పాటే!

-అది నాకు ఇష్టమైన పాటల్లో ఒకటి. -[విద్యార్థి] ♪ ఎవరు అన్నారు, ఎవరు అన్నారు ♪

[అందరూ] ♪ నువ్వు పెర్ఫెక్ట్ కాదు అని ఎవరు అన్నారు? నీకు అంత విలువ లేదని ఎవరు అన్నారు? ♪

♪ నువ్వు మాత్రమే బాధ పెడుతున్నావని ఎవరు అన్నారు? ♪

[గోమెజ్] స్కూలులో నేను నిజంగా చాలా సిగ్గుతో ఉండేదాన్ని,

దానితో ఇద్దరు ఫ్రెండ్స్ తో మాత్రమే స్నేహం చేసేదాన్ని.

ఇంకా, హమ్, నా కజిన్, అంటే, మా చీర్ లీడింగ్ జట్టుకి కెప్టెన్ గా ఉండేది,

అందువల్ల నా కజిన్ కి భయపడి నా జోలికి ఎవ్వరూ వచ్చేవారు కాదు.

నా కజిన్, అంటే, తను ప్రతీదీ కంట్రోల్ చేస్తుంది. హమ్…

[స్టివెన్స్] హమ్, సరే.

నా విషయానికి వస్తే, ఎనిమిది మంది ఉండే కుటుంబంలో పెరిగాను, మా తల్లిదండ్రులకి ఎనిమిది మంది సంతానం.

నాకు పెళ్లి చేయాలి అనుకున్నట్లు మా అమ్మ చెప్పింది,

కానీ, ఒక సందర్భంలో, వాళ్లు ఏం చెప్పారంటే,

“నీకు స్కూలు ఉంది ఇంకా వెళ్లి చదువుకోవడానికి స్కాలర్ షిప్ వస్తుంది కాబట్టి,

మనకి ఇంకేం అవసరం లేదు” అన్నారు.

వాళ్లు ఎలాంటి ఫీజులు కట్టక్కరలేదు.

నాకు పెళ్లి చేయడం లేదని అప్పుడు వాళ్లు నాకు చెప్పారు.

-[స్టివెన్స్] అది చాలా ఆసక్తికరంగా ఉంది. -నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా?

[విద్యార్థి చిన్నగా నవ్వింది] ప్రేమ మీదా?

నీకు ప్రేమ మీద నమ్మకం ఉందా?

[విద్యార్థులు నవ్వుతున్నారు]

-మీలో మీరు ప్రేమతో ఉన్నారని నాకు తెలుసు. -[విద్యార్థులు] అవును.

[చిన్నగా నవ్వుతూ] ప్రేమ అనేది ఒక వరం.

-[విద్యార్థిని] అవును. -[స్టివెన్స్] అవును.

మీరు దాని గురించి ఎదురుచూస్తుంటారా, లేదా కేవలం ఆలోచిస్తూ…

-మీ చదువు మీదే ధ్యాస పెడతారా… -[అనీసియా] నాకయితే…

-…ఆ తరువాత అదే వస్తుంది. కదా? -[అనీసియా] అవును.

లేదా, అంటే, ఒక బాయ్ ఫ్రెండ్ లేదా ఇంకేదైనా ఉండటం.

కాబట్టి, నేనయితే, ఆహ్, నా హైస్కూల్ చదువు అయ్యాక నేను ఒక బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచిస్తాను.

[నాలుక చప్పరించి] నాకు నచ్చింది.

ఎందుకంటే నేను… నేను నా ధ్యాసని రెండుగా పంచలేను.

కాబట్టి, మొదట నేను ఇక్కడ దృష్టి పెడతాను.

ఇల్లు కడుతున్నప్పుడు,

మనం బిల్డింగ్ ని పైకప్పు నుంచి మొదలుపెట్టము.

-పునాదుల నుంచి మొదలుపెట్టాలి. -[గోల చేస్తున్నారు]

కాబట్టి, నాకు పునాది లేదు,

అందువల్ల నేను పన్నెండో గ్రేడ్ చదివే వరకూ…

ఆ తరువాత, నేను దాని గురించి ఆలోచించగలను.

[స్టివెన్స్ చిన్నగా నవ్వింది] అది నాకు నచ్చింది.

నిజంగా బాగా చెప్పావు.

[స్వాహిలి భాష మాట్లాడుతోంది]

[స్టివెన్స్] హమ్.

[స్వాహిలి భాషలో మాట్లాడుతోంది]

-నా పేరా? సెలీనా. -సెలీనా?

-అవును. -సెలీనా.

-మీ పేరు ఏంటి? -ఆహ్, డయానా.

-డయానా? -హమ్.

-అందంగా ఉంది. -[చిన్నగా నవ్వుతూ] హమ్.

[స్టివెన్స్] రఖేల్.

-ఓహ్ అవును. “నాకు ఒక మగబిడ్డ” అని ఆమె చెప్పింది. -ఓహ్! అవును! మీ అబ్బాయి… పెద్దవాడు. సరే.

అతనికి నేను నచ్చుతాను అంటావా?

అతని వయస్సు ఎంత?

-[బీడర్] అతనికి అంటే, ఇరవై, ఇరవై ఒక్క ఏళ్లు ఉంటాయి. -[స్టివెన్స్] సరే!

-[గోమెజ్] ఆ వయస్సు సరిపోతుంది. -అది కొంత నయం కావచ్చు,

సెలీనాకి ఇంకా సరిపోవచ్చు. మా ఇద్దరి వయస్సు 27. సెలీనాకి తక్కువ వయస్సు కుర్రాళ్లంటే ఇష్టం. నిజం.

ఓహ్, దేవుడా. ఏంటి? రఖేల్!

గతంలో, నాకు అలాంటిది ఒకటి ఉండేది.

నా లూపస్ వ్యాధి మళ్లీ పెరుగుతోందని కొద్దిగా ఆందోళనగా ఉంది.

-ఇదిగో, దీని మూత తీసిపెడతావా, దయచేసి? -[స్టివెన్స్] హమ్…హమ్.

నా చేతులు ఇంకా సరిగా పని చేయడం లేదు.

[స్టివెన్స్] వణుకుతున్నాయా?

లేదు, అవి… అవి నొప్పిగా ఉన్నాయి.

-నేను, ఇలా చేసిన ప్రతీసారి, నొప్పి పుడుతుంది. -[స్టివెన్స్] ఎందుకు?

తెలియదు. డాక్టర్ దగ్గర చూపించుకుంటే వాపు ఏమీ లేదని చెప్పాడు.

ఇది తెలుసుకోవాలి అంటే ఒకే ఒక్క మార్గం ఉందన్నాడు, దీనికి కారణం తెలియాలి అంటే, నేను…

-థాంక్యూ. -హమ్…హమ్.

-నేను కాట్ స్కాన్ లేదా ఇంకేదయినా చేయించుకోవాలి? ఎమ్ఆర్ఐ. -ఓహ్, సరే.

-నేను తిరిగి వెళ్లాక స్కాన్ చేయించుకుంటా. -హమ్…హమ్.

వి కాలేజ్

నా పేరు బెట్టీ చెప్, నేను ఇక్కడ నర్సింగ్ విద్యార్థిగా ఉన్నాను.

మీరు బ్లడ్ ప్రెషర్ ని చూస్తున్నప్పుడు, దాని సగటు…

[చెప్] నర్సుగా ఉండటం అంటే,

జనం బాధతో ఉన్నప్పుడు వారితో ఉండి, సాయం చేయాలి.

అందుకనే నా జీవితంలో నేను చేయదగ్గ మంచి పని ఇదే అని అనుకున్నాను.

మా నాన్న నాకు ఆదర్శం.

ఆయన నాకు ఏం నేర్పించారంటే…

ఈ జీవితంలో, మనం తోటివారి పట్ల సానుభూతి చూపించాలని చెప్పేవారు,

మనం తీసుకున్న దానికంటే ప్రజలకు ఎక్కువ ఇచ్చే అవకాశం కల్పించుకోమనే వారు.

అవును.

నేను దేవుడిని నమ్ముతాను.

అందరూ నా గురించి ఏం అనుకున్నా కానీ, నాకు నేను చెప్పుకునేది అదే,

ఇంకా దేవుడు నా జీవితం గురించి ఏం సంకల్పించాడో,

నా జీవితంలో నేను అదే సాధించగలుగుతాను. అవును.

-అది అద్భుతంగా ఉంది. -అవును.

-నేను కూడా దేవుడిని నమ్ముతాను. -వావ్.

[చెప్] నేను ఒక మధ్యతరగతి కుటుంబంలో పుట్టాను.

కానీ దురదృష్టవశాత్తూ, నేను పదో గ్రేడ్ లో ఉన్నప్పుడు,

ఒక రోడ్డు ప్రమాదంలో మా నాన్న చనిపోయారు.

కాలేజీకి వెళ్లడానికి మా అమ్మ దగ్గర డబ్బులు ఉండేవి కావు.

అందువల్ల నేను ఆరు సంవత్సరాల పాటు ఇంట్లోనే ఉండిపోవలసి వచ్చింది.

కేవలం వంట చెరుకు, తాగు నీరు తీసుకురావడం, ఇంట్లో కొన్ని పనులు చేయడంతో సరిపోయేది.

ఆ ఆరు సంవత్సరాలు, నేను చాలా బాధ అనుభవించాను,

ఎందుకంటే నేను మా అమ్మకి ఇంకా అందరికీ భారంగా మారిపోయాను అనిపించేది.

దానితో నేను చాలా నిరుత్సాహంతో, నిరాశతో ఉండేదాన్ని.

ఒక రోజు నేను నది దగ్గరకి వెళ్లాను, అప్పుడు ఏం అనిపించిందంటే…

“ఈ నదిలోకి దూకి మునిగిపోవాలి.

నా జీవితాన్ని ఇంక ముగించాలి, దీనితో…

మా అమ్మ పడే బాధల్ని నేను ఇంక చూడనవసరం లేదు,

నా అక్కచెల్లెళ్లు, నా అన్నతమ్ముళ్లను నేను ఇంక చూడనవసరం లేదు…

ఇంక ఈ జీవితాన్ని చాలించాలి” అనుకున్నాను.

కానీ అక్కడ కొద్దిసేపు కూర్చున్నాక, ఏం ఆలోచించానంటే…

“ఇప్పుడు గనుక నేను ప్రాణం వదిలేస్తే, మా ఇంట్లో పెద్ద సంతానంగా…

నేను నా కుటుంబానికి ఏం ఆదర్శంగా ఉంటాను?” అనుకున్నాను.

-వావ్. -దానితో నేను మేలుకొన్నాను,

నీళ్లు తోడుకుని, ఇంటికి వెళ్లాను.

రెండు వారాల తరువాత…

ఇక్కడ వి కాలేజ్ లో నాకు ఇంటర్వ్యూ కోసం పిలుపు వచ్చింది.

-వావ్. -[చెప్] అది ఒక అద్భుతం.

కానీ ఇప్పుడు నన్ను చూడండి. మా ఇరుగుపొరుగు వారిలో నేను ఒక రోల్ మోడల్ ని.

[ఇద్దరూ] నువ్వు అదే.

కొందరు నాకు కాల్ చేస్తారు, మిగతా అమ్మాయిలతో… మాట్లాడమని అడుగుతారు…

అప్పుడు సాధారణంగా నేను వాళ్లకు అదే చెబుతాను, మీరు రోజూ చేసే పని మీకు కష్టం కావచ్చు…

దానిని చేస్తూ ఉండండి, ఏదో ఒక రోజు మీ జీవితంలో ఒక అద్భుతం జరుగుతుంది" అంటాను.

-అవును. -[చెప్] అవును.

ఆత్మహత్య చేసుకోవాలి అనుకోవడానికి చాలా ధైర్యం కావాలి.

ఇంకా మనం చేయవలసిన పని అది కాదు అని అర్థం చేసుకోవడానికి అంతే ధైర్యం కావాలి.

-అవును. -[గోమెజ్] మనకు మనమే ఆలోచించుకోవాలి.

ఆ విషయంలో నీతో నేను కూడా ఏకీభవిస్తాను. కాబట్టి నువ్వు ఆ మాట చెప్పినప్పుడు,

నువ్వు ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్న సమయంలో నీ ఫీలింగ్ ఏమిటనేది

-నాకు తెలుసు. -[చెప్] అవును.

నిన్ను కలుసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. [చిన్నగా నవ్వింది]

మీ గురించి తెలుసుకోవడం కూడా నాకు ఎంతో గర్వంగా అనిపిస్తుంది. [నవ్వింది]

[చిన్నగా నవ్వుతూ, ముక్కు ఎగబీల్చింది]

[ఉరుములు ఉరుముతున్నాయి]

[అరుస్తున్నారు]

ఓహ్. రఖేల్. ఇలా రా.

[అరుస్తున్నారు]

[గోమెజ్] నా జీవితంలో, అంటే, నాకు ఉన్న లక్ష్యాలలో ఒకటి…

దాదాపు ఏడేళ్లుగా ఇది నా మనసులో ఉన్న విషయం, హమ్,

-ఒక చట్టం తీసుకురావాలి… -అవును. ఓహ్, వావ్.

…ఆ చట్టం ద్వారా ఎలిమెంటరీ స్కూల్ నుంచి హైస్కూల్ వరకూ, ఒక రకంగా,

థెరపీ క్లాస్ తప్పనిసరి చేయాలి.

నాకు ఇప్పుడు ఏం అనిపిస్తోందంటే, మనం పిల్లలుగా ఉన్నప్పుడు, ఇంకా కిండర్ గార్టెన్ లో ఉన్నప్పుడు,

నీకు ఎలా ఉంది అని పెద్దవాళ్లు అడుగుతుంటారు.

కొన్ని ముఖాలు నవ్వుతుంటాయి, కొన్ని ముఖాలు బాధగా కనిపిస్తాయి, పిల్లలు భావోద్వేగాలను నేర్చుకుంటూ ఉంటారు,

అది గొప్ప విషయం, కానీ దాని గురించి మాట్లాడటాన్ని మనం తరువాత కూడా ఎందుకు కొనసాగించము?

-ఫీలింగ్స్ రానురాను క్లిష్టంగా మారుతుంటాయి… -అవును.

-…ఇంకా అవి… అవి భరించడం కష్టం అయిపోతుంటుంది. -హమ్…హమ్.

-[హోస్ట్] నేను ఒక విచిత్రమైన ప్రశ్న అడగచ్చా? -అడుగు.

క్రెయిగ్ వి చారిటీ వ్యవస్థాపకుడు

-ఆ పని చేయడానికి మిమ్మల్ని ఏది ఆపుతోంది? -అది సిద్ధంగా ఉంది.

హమ్, కానీ అది నేను చేయలేను. నాకు అంత సమర్థత లేదు.

[చారిటీ సభ్యురాలు] హమ్.

మీకు తెలుసు, నాకు అంత సామర్థ్యం లేదు.

[చారిటీ సభ్యురాలు] హమ్.

నాకు తెలియదు. నేను పెద్ద అవుతున్న సమయంలో దాని గురించి నేను చాలా ఆలోచించాను.

-[చారిటీ సభ్యురాలు] హమ్…హమ్. అవును. -[గోమెజ్] హమ్.

మీరు అలా ఆలోచించడానికి ఇదే అసలు కారణం,

మీరు అందరితో అనుబంధం కలిగి ఉండటానికి కూడా అదే కారణం.

అందుకే ఆ కారణం వల్లనే మీరు ఒక పరిపూర్ణ మనిషి అయ్యారు.

[గోమెజ్] నిజం ఏమిటంటే, నేను ఎప్పుడూ బాగున్నానని అనుకోలేదు.

నేను స్టేజ్ మీద ఉన్నా, ప్రేక్షకుల ముందు నిలబడినా,

నన్ను ఇష్టపడని ఒక వ్యక్తి గురించే ఎప్పుడూ ఆలోచిస్తాను, ఇంకా వాళ్లని నేను నమ్ముతాను.

నన్ను నేను నమ్మాలని కోరుకుంటాను.

కెన్యాలో నేను కలుసుకున్న ప్రజలు చాలా ప్రేమని పంచారు.

వాళ్లని ఇక్కడ నేను కలుసుకోవడానికి నాకు అర్హత ఉందని నేను అనుకుంటున్నాను.

[ఆవు మెడలో గంట మోగుతోంది]

[స్టివెన్స్] మనం తరువాత చాలా మాట్లాడుకోవచ్చు.

-దేని గురించి? -దీనంతటి గురించి.

-అదే దేని గురించి? ఓహ్, తెలుసు. [ముక్కు ఎగబీల్చింది] -నీ బాధ నాకు తెలుసు.

మనం మూడు నెలలకోసారి ఇక్కడ పర్యటనకి రావాలి.

అంటే, మనం ప్రతి మూడు నెలలకు, ఇలా, మనం ప్లాన్ చేసుకోవాలి.

నీకు ఇంటికి వెళ్లడం అంటే ఎందుకు అంత అయిష్టమో, దాని గురించి కూడా, మనం మాట్లాడుకోవాలి,

నీ ఫోన్ ఎందుకు ఆన్ చేయడం లేదో మనం చర్చించాలి. అది…

నువ్వు అలా ఫీల్ కాకూడదు.

నా ఉద్దేశం నీకు తెలుస్తోందా? ఇది ఎలాగంటే, నీ ఫోన్ ఆన్ చేయడానికి నువ్వు భయపడకుండా ఉండాలంటే,

ఇంటికి వెళ్లడానికి బాధపడకుండా ఉండాలంటే, నీ ఉద్యోగాన్ని నువ్వు ద్వేషించకుండా ఉండాలంటే,

ఏం చేయాలో దానిని నువ్వు నీ జీవితంలో అమలు చేసుకోవాలి.

-నేనేం చెబుతున్నానో తెలుసా? -హమ్.

అది ఎలాగంటే, ఏంటి… ఎందుకంటే… ఎందుకంటే నీ భయాలని అధిగమించడానికి

నీ జీవితంలో కొన్ని అమలు చేయాలి.

నీ జీవితాన్ని ఇదే స్థితిలో నిరంతరం గడపాల్సిన అవసరం నీకు లేదు.

ఒక విధంగా, అది వా… వాస్తవాన్ని విడిచి పారిపోవడం లాంటిది. నేను అంటున్నది అర్థమవుతోందా? అది ఎలాగంటే…

లేదా ఇదే వాస్తవమా?

ఇది వాస్తవం కాదు. ఇది వాళ్ల వాస్తవం. ఇది…

ఇది ఏడాదిలో కొన్నిసార్లు మాత్రమే వాస్తవం.

నువ్వు ఇక్కడికి వచ్చి స్వచ్ఛందంగా సేవ చేసి ఒక వారం రోజులు ఉండచ్చు,

కానీ ఇది… ఇది నీ వాస్తవం కాదు.

♪ నాకు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది ♪

♪ నాకు కళ్లు మూసుకోవాలని లేదు ♪

కెన్యన్ కుర్రాళ్ల గాయక బృందం

♪ నాకు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది ♪

♪ నాకు కళ్లు మూసుకోవాలని లేదు ♪

♪ నాకు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది ♪

♪ నాకు కళ్లు మూసుకోవాలని లేదు ♪

♪ నాకు ఎప్పటికీ ఇక్కడే ఉండిపోవాలని ఉంది ♪

♪ నాకు కళ్లు మూసుకోవాలని లేదు ♪

[కేరింతలతో చప్పట్లు కొడుతున్నారు]

లండన్

[అరుస్తున్నారు]

[హారన్ మోగుతోంది]

-[గోమెజ్] అది ఎవరు? -[టీమ్ సభ్యుడు] పత్రికల వాళ్లు అడ్డుగా ఉన్నారు.

[కేషిషియన్] ఓహ్, దేవుడా. అది పత్రికల వాళ్ల కార్ పూల్.

[టీమ్ సభ్యుడు] హా, మూకుమ్మడిగా వస్తున్నారు.

ఇక్కడ చాలా గోలగా ఉంది, క్రిస్.

[క్రిస్] నాకు తెలుసు.

నాకు ఇది ఒక రకమైన కల్చర్ షాక్ లాగా అనిపిస్తోంది.

[క్రిస్] నాకు తెలుసు.

-[మింగస్] సెలీనా? గుడ్ మార్నింగ్. -హమ్…హమ్.

[గోమెజ్] హేయ్.

ఇప్పుడు టైమ్ ఏడు అయింది. బ్యూటీ బృందం మరొక అరగంటలో పని మొదలుపెడతారు.

[స్టివెన్స్] సెల్లీ?

ఓహ్, లేదు. నాకు ఏదో పీడకల వచ్చింది.

నాకు కెన్యాలో ఒక్క చెడ్డ కల కూడా రాలేదు, తెలుసా?

-[ఫ్రెండ్] నాకు తెలుసు, కానీ… -కెన్యాలో తనకి చెడు కలలు రాలేదు.

[గోమెజ్] నేను ఏం చెబుతున్నాను?

నేను కేవలం కొన్ని మాటలు మాత్రమే విన్నాను ఎందుకంటే మీరు, అంటే, గొణుగుతున్నారు,

కానీ, ఒక్క విషయం మాత్రం, అదీ, “అందరి కోసం కాఫీ తెప్పిస్తున్నాను” అని.

-అప్పుడు అనుకున్నాను, “ఓహ్, వావ్!” అని. -తను ఆ మాట చెప్పిందా?

[ఫ్రెండ్ నవ్వుతోంది] ఇంక తను ఏం అందంటే…

[స్టివెన్స్] ఈ రోజు చేసిన విధంగా పని చేస్తే,

అటువంటి పర్యటనలు చేయడానికి నీకు ఒక అవకాశం కల్పిస్తుంది

-ఇంకా కొందరి జీవితాలలో మార్పు తెస్తుంది, తెలుసా? -హమ్.

కాబట్టి అది కొద్దిగా కష్టమైనా సరే, అది… అది, నీకు తెలుసు…

ఏదైనా థాయ్ ఆర్డర్ చేయగలవా? ఆ థాయ్ వంటకం?

[స్టీవెన్స్] ఇప్పుడు థాయ్ వంటకం కావాలా? పొద్దున్న ఏడుకి?

-అవును. -ఎలాగోలా సంపాదిద్దాం.

మన స్టూడియోలో ఉన్నారు, ఒకే ఒక్క, అసలైన రాణి…

-ఆహ్. -…ఆమెనే సెలీనా గోమెజ్!

[చప్పట్లు]

-[వ్యాఖ్యాత] అయితే, మీ ఆల్బమ్ వస్తోంది. -అవును.

మీరు మ్యూజిక్ కి బ్రేక్ ఇచ్చారు.

ఆ విరామసమయంలో మీరు ఏం చేసేవారు… మీరు బ్రేక్ తీసుకున్నప్పుడు?

ఆ సమయంలో కొన్ని సంఘటనలు జరిగాయి, అవి వ్యక్తిగతమైనవి ఇంకా కష్టమైనవి కూడా,

ఇంకా, హమ్, కానీ చివరికి అది… అది చాలా అవసరమైంది.

అందరికీ హలో. నేను సెలీనా గోమెజ్,

నేను ఇంటర్నెట్ ద్వారా మీరు అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెబుతున్నాను.

“సెలీనా గోమెజ్ ఓరియో బిస్కెట్లని ఫోర్కుతో తింటుంది.”

హమ్, ఇవి గొప్పగా ఉన్నాయి. నేను ఈ ప్రపంచం కోసం గొప్ప పనులు చేస్తున్నాను.

ఈ రోజు ఈ ఇంటర్వ్యూ నెంబర్ ఎంత?

నాలుగు.

-[గ్రీన్] నాలుగా? -[మాస్కెల్] ఇప్పటికే నాలుగా?

-[అరుస్తున్నారు] -[బార్] సెలీనా, మీ పాట నిజంగా నన్ను

భావోద్వేగానికి గురి చేసింది, మీకు హగ్ ఇవ్వాలని ఉంది,

ఇంకా మిమ్మల్ని ఒక దుప్పటిలో చుట్టేసి అబ్బాయిల గురించి మాట్లాడాలని ఉంది.

నా పాట అసలు ఉద్దేశం ఏమిటంటే నేను నిజంగా అలా ఊరికే కూర్చుని

అబ్బాయిల గురించి మాట్లాడే అవసరమే లేదని.

[మీడియా ప్రతినిధి] సెలీనా, మీ ఫ్యాన్స్ కోసం!

హేయ్, నేను సెలీనా గోమెజ్ ని, ఇంకా నేను ఎమోజీ ఆట ఆడబోతున్నాను.

మీరు ఎప్పుడైనా కేవలం మజా కోసం విచిత్రమైన ఫుడ్ కాంబినేషన్ ని ప్రయత్నించారా?

పాప్ కార్న్ ఇంకా పికిల్ జ్యూస్.

[ఇంటర్వ్యూ చేసే వ్యక్తి] మీకు ఇష్టమైన రంగు ఏది?

నాకు ఇష్టమైన రంగు ఎరుపు.

విజార్డ్స్ ఆఫ్ వేవర్లీ ప్లేస్.

-[గోమెజ్ నవ్వుతోంది] -ఆగండి.

అయితే ఒక్క డిజె ఒక్క పదంతో సమానం.

“మార్ష్ మెల్లో.”

-ఫ్లఫీ. -సరే. ఇంక అంతే. థాంక్యూ.

-[కెమెరామన్] థాంక్యూ. -థాంక్స్.

ఓహ్. సరే, సారీ.

[నిట్టూర్చింది]

[టీమ్ సభ్యుడు] అవి చాలా చెత్త ప్రశ్నలు.

[మిగతా సభ్యులు నవ్వుతున్నారు]

ఇది చూస్తున్నంత సేపు సమయం అంతా వృథా అనిపించింది.

నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను?

[ఫ్రెండ్] ప్రస్తుతం, మనం లేస్తున్నాం, ఆ తరువాత పది నిమిషాల్లో బ్యూటీషియన్ బృందం వస్తున్నారు.

సారీ, నేను నిద్రలో ఉన్నాను. నేను ఏం చేయాలి?

-[మింగుతోంది, నవ్వుతోంది] -[ముక్కుతోంది]

జెట్ ల్యాగ్ తో ఉన్నప్పుడు మనకి కలిగే ఫీలింగ్స్…

ఆ విధంగా మరెప్పుడూ మనం ఫీల్ అవ్వము.

-[హెయిర్ స్టయిలిస్ట్] అది ఏంటి? -[మారినో] అంటే, అన్నింటినీ కలిపిన మిశ్రమం.

-[హెయిర్ స్టయిలిస్ట్] ఎప్పుడూ ప్రయత్నించలేదు. -[మరీనో] తెలుసు.

[హెయిర్ స్టయిలిస్ట్] నువ్వు ఏదో వేరే ప్రపంచంలో ఉన్నట్లు అనుకుంటూ ఉంటావు.

-[మారీనో] అంటే, అంతరిక్షంలో ఉన్నట్లు. -[హెయిర్ స్టయిలిస్ట్] ఆహ్.

[గోళ్ల టెక్నీషియన్] సరే, వేయి.

[బీప్ శబ్దాలు]

[సైరన్ల మోత]

అది నా కోసమే వస్తోంది.

[బృందం సభ్యులు నవ్వుతున్నారు]

[స్టివెన్స్] మనం తిరిగి వచ్చే రాత్రి మరిస్సా పుట్టినరోజు విందుకి వెళ్లాలని తెలుసా?

[గోమెజ్] మనం తిరిగి వచ్చే రాత్రా? వద్దు. నేను ఎప్పుడూ చేసే పనే చేస్తాను.

నేను ఆ విందుకి రాను. నేను… ఆ మరుసటి రోజు మ్యూజిక్ వీడియో షూటింగ్ చేయాలి.

మంచిది.

-నా ఉద్దేశం, అది చాలా ప్రయాస. -అది మంచిదే.

లేదు, అది మంచిది, కానీ నువ్వు కొద్దిరోజుల పాటు గందరగోళంగా ఉంటావు.

అవును, పూర్తిగా. ఊరికే నువ్వు రాగలవేమో అనుకున్నా,

-కానీ అది కేవలం… హమ్. -నేను వచ్చేదాన్నే,

-కానీ నాకు సర్దుబాటు చేయడానికి ఒక్క రోజు కూడా లేదు. -సరే.

నా పని గురించి నేను ఫిర్యాదు చేస్తున్నానని నీకు అనిపిస్తోందా?

అవును. నువ్వు అదే ఫీల్ అయ్యావు… నువ్వు ఫిర్యాదు చేసినట్లే మాట్లాడావు. [గొంతు సవరించుకుంది]

అలా ఏమీ లేదు. రఖేల్, నేను ఏం అంటున్నానంటే, నాకు విశ్రాంతి కావాలి.

-అది తప్పు అని కాదు. కానీ నేను… -[గొంతు సవరించుకుంది] లేదు, అది తప్పేమీ కాదు.

నువ్వు చెప్పిన విధానం అలా అనిపించింది. ఏం చెప్పావని కాదు.

అయితే నేను నా పని గురించి ఏమీ ఫిర్యాదు చేయడం లేదు కదా.

నేను నిజంగా ఫిర్యాదు చేస్తున్నది ఏమిటంటే నేను కొద్దిగా నిద్రపోగలిగితే బాగుంటుందని అంతే.

[గొంతు సవరించుకుంది]

[గోమెజ్ నిట్టూర్చింది]

-నాకు కృతజ్ఞత లేదు అనుకుంటున్నావా… -లేదు, నీకు కృతజ్ఞత లేదని అనుకోవడం లేదు.

కొద్ది రోజులుగా నీలో ఉత్సాహం… నిరుత్సాహం రెండూ కనిపిస్తున్నాయి,

కాబట్టి నేను కేవలం… ఏం జరుగుతోందని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను.

కానీ మనం ఆఫ్రికాలో ఒక వారం రోజులు అద్భుతంగా గడిపాము…

నాకు తెలుసు.

నేను ఇంకా మేలుకొంటున్నాను.

నేను లండన్ ని ఎంత ఇష్టపడతానో నేను అందరికీ చెప్పడం నువ్వు విన్నావు.

నా నుంచి నీకు ఇంకేం కావాలి?

ఏమీ లేదు.

[గొంతు సవరించుకుంది]

“నువ్వు బాగానే ఉన్నావా?” అని అడగబోయాను. ఎందుకంటే నువ్వు సంతోషంగా కనిపించడం లేదు.

నేను సరదాగానే ఉన్నాను.

మంచిది. నువ్వు సరదాగా ఉంటే నాకు చాలా సంతోషం.

కానీ, నాకు అలా అనిపించలేదు, అందుకే నిన్ను అడుగుతున్నాను.

-నేను ఇంక విసిగిపోయాను. -[దగ్గుతోంది]

హమ్…హమ్.

[నములుతూ, దగ్గుతోంది]

[ఫ్రెంచ్ ఫ్యాన్స్ గోల చేస్తున్నారు]

ఓహ్.

-హేయ్. -[జట్టు సభ్యులు మాట్లాడుతున్నారు]

[ఎన్.ఆర్.జె ఇంటర్వ్యూయర్] మీ కొత్త ఆల్బమ్ గురించి, మీ కొత్త ప్రాజెక్టు విషయంలో

వాళ్లు ఎలాంటి అంచనాలు పెట్టుకోవాలని మీరు అనుకుంటున్నారు?

నా కథ చెప్పడానికి ఇదే సరైన సమయం అని నేను భావించాను

ఎందుకంటే మరికొంతకాలం గడిస్తే అది అప్పటికి అప్రస్తుతం కావచ్చు.

“లూజ్ యూ టు లవ్ మీ” విడుదల చేయడం ద్వారా నేను అందించాలనుకున్న సందేశం

అది ఇతరులను ఉద్దేశించిన పాట.

అది… అది ప్రజలకు ఏం తెలియజేస్తుందంటే ఎవ్వరూ ఒంటరివారు కారని

అది ఒక క్లిష్టమైన ఫీలింగ్ అని చెబుతుంది,

ఇంకా మనం చేయవలసింది ఏమిటంటే దానిని అలా మన మనసుల నుంచి పోనివ్వాలి.

మీరు గాయని, నటి, మీరు ప్రొడక్షన్ లో నటించారు, ఫ్యాషన్ లో ఉన్నారు.

ఆహ్, మీరు ఇంకేదయినా కొత్తది ప్రయత్నించాలి అనుకుంటున్నారా?

-భవిష్యత్తులో? -ఆహ్,

ఆహ్, నేను చెప్పగలిగింది ఏమిటంటే ఇవన్నీ కొద్దికొద్దిగా చేస్తూనే ఉంటాను.

కానీ క్రమంగా, ఈ పనులన్నీ నిదానించాక,

నా జీవితంలో ఎక్కువ భాగాన్ని నేను సేవాకార్యక్రమాలకే వెచ్చించదల్చుకున్నాను.

-అవును. అదే నాకు మంచిది. -అవును.

-[ముక్కుతూ] వావ్. థాంక్యూ. -[నవ్వుతోంది]

-అది అభినందనీయం. -[నవ్వుతూ] చాలా థాంక్స్.

మీరు నిజంగా అర్థం చేసుకున్నారు అనిపించింది.

సరే, అయిపోయిందా?

-[ఎన్.ఆర్.జె. ఉద్యోగి] హా. -[సభ్యుడు] టెన్షన్ గా ఉంది.

దయచేసి నేను కూర్చోవచ్చా?

అలాగే, బంగారం.

-లోపలికి రా. -[బృందం సభ్యుడు] మన పని అయిపోయింది.

[స్టయిలిస్ట్] నీ డ్రెస్ మార్చేస్తాము.

-నేను ఎప్పుడూ ఇంత చెత్తగా చేయలేదు. -ఏం జరిగింది?

నేను విసిగిపోయాను. నేను ఇంక ఇలాంటివి చేయలేను. ఇది చాలా పిచ్చితనంగా ఉంది.

ఇది ఎంత చౌకబారుగా నాకు అనిపిస్తుందో… మీకు ఏమైనా తెలుసా? నేను…

-[గుర్రుమంటోంది] -సరే.

ఆమె నన్ను కొన్ని ప్రశ్నలు అడిగింది, అంటే, అవి మంచి ప్రశ్నలే,

కానీ ఆ తరువాత నేను ఏం చెబుతున్నానో కనీసం పట్టించుకోవడం లేదు.

ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకెప్పుడూ చేయను.

నేను ఏదో వస్తువునేమో అనిపించింది.

[నిట్టూర్చింది] ఓహ్, దేవుడా.

-అది నాకు బాగా కోపం తెప్పించింది. -[జట్టు సభ్యురాలు] సరే.

మీకు తెలుసా… అదేంటో తెలుసా, నేను ఏదో డిస్నీ బొమ్మలాగా నాతో మాట్లాడారు అనిపించింది.

[జట్టు సభ్యుడు] అది ప్రేరేపిస్తుంది.

నేను చేయను… నేను కేవలం… అలా ఉండకూడదని నా జీవితంలో చాలా ఏళ్లుగా నేను ప్రయత్నిస్తూ వచ్చాను,

నేను ఒక మంత్రగత్తెలా ఉన్నాను,

ఈ డ్రెస్సు వేసుకుని… అంటే, ఆ మంత్రదండంతో మళ్లీ.

-ఏది ఏమైనా, ఫర్వాలేదు. -[కెషిషియన్] నువ్వు అది పూర్తి చేశావు.

-ఇంక నువ్వు చేయనవసరం లేదు. -అవును.

[అభిమానులు గోల చేస్తున్నారు]

హాయ్.

[కేరింతలు]

[ఫ్యాన్స్ అరుస్తున్నారు] సెలీనా.

-హాయ్, సెలీనా. ఎలా ఉన్నావు? -సెలీనా!

[అరుస్తున్నారు]

[ఫ్యాన్స్ అరుస్తున్నారు] సెలీనా!

ఓహ్, నేను అక్కడికి వెళ్తున్నాను.

[మొదటి ఫ్యాన్] ముద్దొస్తున్నావ్. థాంక్యూ.

-[ఏడుస్తోంది] -ఎలా ఉన్నావు? ఫర్వాలేదు.

-[ఏడుస్తోంది] -ఫర్వాలేదు. నువ్వు బాగున్నావు.

-అన్నీ… ఆనంద భాష్పాలు, అనుకుంటా? -అవును, అవును, అవును.

సరే.

-మేము ఒక ఫోటో తీసుకోవచ్చా? -అలాగే. ఒక ఫోటో దిగుదాం.

[రెండో అభిమాని] సెలీనా, ఫోటో, త్వరగా!

[కేరింతలు కొనసాగుతున్నాయి]

-[బాడీగార్డ్] బాగానే ఉందా? -నేను బాగున్నాను. ఫర్వాలేదు.

[నిట్టూర్చింది]

[ముక్కుతోంది]

[స్టివెన్స్] ఉదయం వేసుకునే మందులు వేసుకుంటావా?

హమ్.

[స్టివెన్స్] నీ సమాధానం నాకు తెలుసు, కానీ… నువ్వు వేసుకోవాలి.

-[మీడియా ప్రతినిధులు మాట్లాడుతున్నారు] -[మీడియా ప్రతినిధులు] మార్నింగ్, సెలీనా.

[కెమెరా షటర్ల శబ్దాలు]

[భారంగా శ్వాస పీలుస్తోంది]

[అస్పష్టంగా మాట్లాడుతోంది]

దీనిని లోపలి నుంచి లేదా కింది నుంచి పైకి పెట్టుకోండి.

[క్యాపిటల్ ఎఫ్ఎమ్ ఉద్యోగి] మీరు ఏం చేయబోతున్నారో మీకు తెలుసా?

-లేదు. నేను అలాగయితేనే బాగా చేయగలను. -[నవ్వుతున్నాడు]

[చిన్నగా నవ్వుతూ] సరే, మిమ్మల్ని ఈ గదిలో ఒంటరిగా విడిచిపెట్టబోతున్నాము.

మీరు అద్దంలో మాట్లాడుతుంటారు. ఇది మీతో మీరు జరుపుకొనే సంభాషణ.

-సరే. -హమ్, ఆ తరువాత మీరు వింటారు, హమ్,

సూచనలు… అక్కడ స్పీకర్ నుంచి మీకు వినిపిస్తుంటాయి.

-సరే. -ఆ తరువాత మేము దాన్ని రికార్డు చేసుకుంటాం.

-అలాగే. -అద్భుతం.

[క్యాపిటల్ ఎఫ్ఎమ్ రెండవ ఉద్యోగి] హాయ్, సెలీనా. దయచేసి మీరు మొదటి ఎన్వలప్ తెరుస్తారా?

“మీరు ప్రేమలో ఉన్నట్లు మీకు గుర్తు చేసే పాట.”

[నాలుక చప్పరించి] అలాంటి పాట ఏదైనా ఉందని నాకు తెలియదు.

[చిన్నగా నవ్వుతోంది]

దయచేసి రెండవ ఎన్వలప్ తీయండి.

[గొంతు సవరించుకుంది]

“అద్దంలో చూసినప్పుడు మీరు ఏం చూస్తారు?”

ప్రశ్నలు ఇంత వ్యక్తిగతంగా ఎందుకు ఉన్నాయి?

[నాలుక చప్పరించి] నేను, ఆహ్…

[నిట్టూర్చింది] నేను ఏం చూస్తానంటే…

అవును. నేను అద్దంలో ఏం చూస్తాననేది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాను, అనుకుంటా.

ఇవి మంచి ప్రశ్నలు.

మీ అల్టిమేట్ కల ఏంటి?

నా అల్టిమేట్ కల ఏమిటంటే నేను కొందరి ప్రాణాలనయినా…

ఏ మార్గం ద్వారా అయినా…

[నిట్టూర్చి] …కాపాడగలగాలి,

అది పాట కావచ్చు, సంగీతం కావచ్చు, లేదా నేనయినా కావచ్చు, నేను అనుభవించిన

కష్టాలు లేదా సమస్యల గురించి మాట్లాడటం ద్వారా కావచ్చు.

కొంతమందికి అసలు తమకి ఏం జరుగుతోందో, తమ ఆలోచనలు ఎందుకు మారుతున్నాయో

తెలియని వారి గొంతుని నేను వినిపిస్తాను.

హమ్, నేను అదే ఆశిస్తాను. [చిన్నగా నవ్వింది]

అద్భుతం. చాలా థాంక్స్.

[గోమెజ్] ఒక అమ్మాయి ఉంది, ఆమె యాంగ్జయిటీతో బాధపడుతోంది

ఇంకా తను అద్దంలో చూసుకుంటే ఇక కదలలేదు.

అందరూ చూస్తుండగా తను నవ్వుతూ ఉంటుంది కానీ ఒంటరిగా ఉన్నప్పుడు ఏడుస్తుంది.

తను దాక్కునే ఉంటుంది ఎందుకంటే తను బయటకు రావాలంటే భయంతో వణికిపోతుంది.

నా ప్రపంచం పూర్తిగా శూన్యం.

నా ప్రపంచం చాలా పెద్దది ఇంకా ఆత్మీయత లేనిది.

నాకు సంతోషం ఇంకా ఆశ కావాలి.

నేను ఎట్టకేలకు శ్వాస పీల్చినప్పుడు స్వచ్ఛమైన గాలి కావాలి.

భవిష్యత్తులో మనం ఏమిటన్నది ప్రస్తుతం గుర్తించలేము.

అందరూ ఎందుకు “రేర్” అనే టి-షర్టు వేసుకుని ఉన్నారు?

[ఫాలన్] రేర్ ఇప్పుడు విడుదల అయింది. రోలింగ్ స్టోన్ కి అది నచ్చింది.

నువ్వు విజేతవి అని బిల్ బోర్డ్ మెచ్చుకుంది.

ఇటీవల కాలంలో విడుదలైన అత్యుత్తమ పాప్ ఆల్బమ్స్ లో రేర్ ఒకటి అని

-వెరైటీ పత్రిక రాసింది. -[రేడియో వ్యాఖ్యాత] ఇది సెలీనా

మూడవ స్టూడియో ఆల్బమ్ ఇంకా గత నాలుగేళ్లలో ఆమె మొదటిసారిగా పాడినది.

“ఇంతవరకు నేను చేసిన పాటల్లో ఇది అత్యుత్తమమైనది” అని ఈ గాయని అంటోంది.

[గోమెజ్] కెన్యా పర్యటన ఒక కలలా సాగింది.

నేను కేవలం ఉత్సుకత కొద్దీ కుర్రాళ్లని కూడా అడిగాను

కానీ వాళ్లు ఎలా ఉన్నారంటే, “లేదు లేదు,”

-[చిన్నగా నవ్వుతోంది] -“మేం ఊరికే…”

వాళ్లు కొంటెగా నవ్వారు. వాళ్లు ఏం చెప్పారంటే, “మేము ఏం చేయాలి అనుకుంటామో అదే చేస్తాము,

ఆ తరువాత అది జరిగి తీరుతుంది” అన్నారు.

-[నవ్వుతున్నారు] -అది అద్భుతం.

నా ఉద్దేశం, ఈ ఆడపిల్లలు నా కన్నా ఎక్కువ ఆత్మవిశ్వాసంతో ఉన్నారు, అది చూడటానికి చాలా అందంగా అనిపించింది.

ఇంకా కొన్నిసార్లు… నేను చాలా ఎక్కువగా, హమ్…

నేను విపరీతంగా ఆలోచిస్తాను.

ఇంకా నేను తిరిగి ఇవ్వడం అనేది నా జీవితంలో ఒక అంశం కాకపోతే గనుక

ఇది జీవితమే కాదు… అది నాకు ఎలా అనిపిస్తుందంటే… అది ఎలా అనిపిస్తుంది…

అది నాకు మంచిగా అనిపించదు. ఎలా అనిపిస్తుందంటే

నేను కేవలం తీసుకుంటున్నాను, తీసుకుంటున్నాను, తీసుకుంటున్నాను ఇంకా జనం నాకు

ఇది ఇవ్వాలి, అది ఇవ్వాలి, హమ్,

అది నా వ్యక్తిత్వం అలాంటిది కాకపోయినా సరే.

కాబట్టి ఇప్పుడు నేను ఆ పనిని మూడు నెలలకు ఒకసారి చేయాలి అనుకుంటున్నాను.

నాకు అలీన్ ఇంకా జాక్ తో విందు కార్యక్రమం ఉంది,

అక్కడ నా లక్ష్యాల గురించి

-మేం చర్చిస్తాం. -[కేషిషియాన్] సరే.

మనం ఒక నిమిషం పాటు, మా ట్రిప్ గురించి వి సంస్థ గురించి మాట్లాడుకుందామా,

-నువ్వు మొదలుపెట్టచ్చు కదా? -[గోమెజ్] హమ్.

నువ్వు ఏం ఆలోచిస్తున్నావో కొద్దిగా మాకు కూడా చెప్పు.

స్కూళ్లలో బోధించడానికి ఒక విధమైన పాఠ్యాంశాన్ని

ప్రవేశపెట్టే మార్గం గురించి అన్వేషించాలని ఉంది.

మన ఎమోషన్స్ తో మనం కనెక్ట్ అవ్వడం గురించి అందుకు తగిన జ్ఞానం కలిగి ఉండటం గురించి

చాలామంది చాలా చెబుతారు.

కానీ దాన్ని గనుక మనం అర్థం చేసుకోలేకపోతే మనం ఎలా ఉంటామంటే… నా ఉద్దేశం,

-మనం ఘోరంగా తయారయిపోతాం. -నువ్వు కూడా…

మనకి సానుభూతి ఉండదు, మనలో దయాగుణం ఉండదు.

-అవును. -మనకి… మనకి జనంతో అనుబంధం ఏర్పడటానికి

ఎలాంటి మార్గం కనిపించదు ఎందుకంటే మనకి అది ఎలా ఏర్పరుచుకోవాలో కూడా తెలియదు.

నువ్వు ఇలా ఉందాం అనుకుంటున్నావు.

-అది… అది… అది ఒకరకంగా… -నీకు అది చేయాలని ఉంది.

నాకు చాలా చాలా ముఖ్యమైనది.

[రేడియో వ్యాఖ్యాత] ఒక ప్రాణాంతకమైన వైరస్ గురించి చర్చతో ఈ రోజు నా కార్యక్రమాన్ని ప్రారంభించాలి అనుకుంటున్నా

కొందరు వైద్య అధికారుల అంచనాల ప్రకారం అది కొన్ని వేలమందికి

లేదా కొన్ని లక్షలమంది ప్రజలకి సోకవచ్చు.

అమెరికాలో ఈ వైరస్ సోకిన రెండవ కేసుని ఈ రోజు ఉదయం ప్రకటించారు.

ఇది కరొనా వైరస్ అనేబడే వైరస్ కి కొత్త రూపం.

[న్యూస్ రీడర్] మన దేశంలో ప్రధాన నగరాలన్నీ

దాదాపు దెయ్యాల దిబ్బల్లా కనిపిస్తున్నాయి.

[రెండవ న్యూస్ రీడర్] రాత్రికి రాత్రి, మన దైనందిన జీవితాలలో చాలా భాగం

స్తంభించిపోయినట్లు అనిపిస్తుంది.

అమెరికన్లు అందరూ ఇప్పుడు “కొత్త జీవనశైలి” అనబడే జీవన విధానానికి అలవాటుపడటానికి ప్రయత్నిస్తున్నారు.

[మూడో న్యూస్ రీడర్] పెద్ద ప్రైవేటు కంపెనీలైన

మైక్రోసాఫ్ట్ నుంచి ఎనర్జీ డిపార్ట్మెంట్

ఇలాగే ట్రెజరీ డిపార్ట్మెంట్ ల మౌలిక సదుపాయాల వ్యవస్థలు బాగా దెబ్బతిన్నాయి.

-చట్టసభల సభ్యులు ఇక జవాబులు డిమాండ్ చేస్తున్నారు… -హేయ్ సెల్,

నీ బ్లడ్ ప్రెషర్ ని చూడబోతున్నాం.

[స్టివెన్స్] హలో, విన్నీ.

[న్యూస్ రీడర్] గుడ్ ఈవినింగ్, మా షో చూస్తున్నందుకు థాంక్స్.

మేము వి చారిటీ గురించి బ్రేకింగ్ న్యూస్ తో ప్రారంభించబోతున్నాం,

కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో మీద ఇంకా ఈ సంస్థ పైన

కుంభకోణం అభియోగాలు ఉండటంతో తాజాగా ఎథిక్స్ పరిశోధన ప్రారంభమైంది.

వి చారిటీ సంస్థ కెనడాలోని తమ కార్యకలాపాల్ని నిలిపివేసింది.

అక్కడి లిబరల్ ప్రభుత్వం ఈ చారిటీ సంస్థకి

మల్టీ మిలియన్ డాలర్ కాంట్రాక్టుని కేటాయించడంతో ఈ సంస్థపై ఇంకా ప్రధానిపై అనుమానాలు మొదలయ్యాయి…

[గోమెజ్] వి చారిటీ సంస్థ మీద వస్తున్న అభియోగాల వల్ల

వాళ్లతో నేను కలిసి చేయాలనుకున్న పనులు దాదాపు అసాధ్యం అయ్యాయి.

[మూలుగుతోంది]

[కీల్ బర్గర్] చాలా ముఖ్యమైన విషయం…

[గోమెజ్] అది నా మనసుని భగ్నం చేసింది ఎందుకంటే నేను వాళ్ల మంచి ఉద్దేశాలని చూశాను,

అలాగే కెన్యాలో తమ జీవితాలు మారిపోయిన ఆడవారిని నేను కలుసుకున్నాను.

కానీ ఇప్పుడు ఇదంతా సంక్లిష్టం అయిపోయింది.

[కీల్ బర్గర్] మేము ఈ సంస్థని 1995లో ప్రారంభించాము

థార్న్ హిల్ లో మా చిన్నతనంలో మా పేరెంట్స్ ఇంట్లో బేస్మెంట్ లో ఈ సంస్థ ఆవిర్భవించింది,

-ఇంకా, ఆహ్, ఇది మా 25వ వార్షికోత్సవం. -ఇది వినలేకపోతున్నాను. ఇది భలే దెబ్బ కొట్టింది.

[గోమెజ్] నేను కుంగిపోయాను.

నాకు కోపం వచ్చింది.

ఈ కోవిడ్ 19 పాండమిక్ మన బంధుమిత్రులతో మన సంబంధాలను దూరం చేయడం మొదలుపెట్టింది.

కెన్యాలో నేను తెలుసుకున్న ప్రయోజనం నా నుంచి దూరం అయిపోయింది అనిపించింది.

ఇది ఇంతకన్నా ఘోరంగా ఉండదు అనుకుంటున్న సమయంలో,

అది కూడా జరిగిపోయింది.

[ఏడుస్తోంది] నాకు తెలియదు. [ముక్కు ఎగబీల్చింది]

నా లూపస్ వ్యాధి.

[కెమెరామన్] నీకు నొప్పిగా ఉందా?

-[ఏడుస్తోంది] -నాకు ఒక హగ్ ఇవ్వు. సారీ.

-ఫర్వాలేదు. -[కెమెరామన్] ఐ లవ్ యూ.

నేను కూడా నిన్ను ప్రేమిస్తున్నాను. [ఏడుస్తోంది]

[కెమెరామన్] అది నయం అవుతుంది.

వాళ్లు దాని గురించి తెలుసుకుంటున్నారు. నువ్వు త్వరలోనే కోలుకుంటావు.

[ఫ్రెండ్] నీకు లూపస్ ఉంది అని నువ్వు కనుక్కున్న కొత్తలో

ఇదే విధంగా నొప్పిని అనుభవించావా?

[ఏడుస్తూ] అవును, కానీ అప్పుడు నేను చాలా చిన్నపిల్లని.

అంటే, నా చిన్నప్పుడు ఎప్పుడూ నాకు ఆ నొప్పి తెలియలేదు. [ఏడుస్తోంది]

-ఓహ్, దేవుడా. -కానీ, అంటే, ఇప్పుడు, ఇది బాగా నొప్పిగా ఉంది,

నేను ఉదయాన్నే నిద్రలేచినప్పటి నుంచి. [ముక్కు ఎగబీలుస్తోంది]

అది నొప్పిగా ఉండటంతో నాకు వెంటనే ఏడుపు వచ్చేసింది.

-[ఫ్రెండ్] సరే. -అంటే, ప్రతీదీ. [ముక్కు ఎగబీలుస్తోంది]

నాకు నా గతం గురించి ఇంకా అలాంటి ఘటనల గురించి పీడకలలు వస్తున్నాయి. [ముక్కు ఎగబీలుస్తోంది]

నా గతం ఇంకా నేను చేసిన తప్పులు… [ముక్కు ఎగబీలుస్తూ] …అదే నన్ను డిప్రెషన్ లోకి…

నెడుతోందని అనుకుంటున్నాను.

నాకు ఏం అనిపిస్తోంది అంటే, నా జీవితం అంతా, చిన్నతనం నుంచి, పని చేస్తునే ఉన్నాను

కానీ నాకు ఇప్పుడు కావలసింది ఏమిటంటే, నా కుటుంబమే. [ముక్కు ఎగబీలుస్తోంది]

నాకు, అంటే, ఒక అమ్మ లాగా ఉండాలని ఉంది.

నేను రఖేల్ తో కూడా చెప్పాను, నాకు, అంటే, కొన్నిసార్లు మానేయాలని ఉందని,

ఆ రకంగా నేను కూడా అందరిలాగే చాలా సంతోషంగా మామూలుగా ఉంటాను. [ముక్కు ఎగబీలుస్తోంది]

కానీ తను ఏం అంటుందంటే, “నువ్వు మానేయకుండా ఉండేలా దేవుడు నీకు ఒక వేదిక ఇచ్చాడు

అని నాకు అనిపించింది, నీకు తెలియాలని చెబుతున్నాను” అంటుంది. [ముక్కు ఎగబీలుస్తోంది]

నాకు, అంటే, ఇంత ఎక్కువ ప్రఖ్యాతి అవసరం లేదు.

నాకు ఇదంతా వద్దు అనిపిస్తోంది.

కానీ నేను ఈ స్థాయిలో ఉన్నానని నాకు తెలుసు, ఇంకా దీనిని మంచి కోసం ఉపయోగించాలి.

నేను ఇక్కడ ఇరుక్కుపోయాను అనిపిస్తోంది, కానీ నేను ముందుకు సాగాలి. [ముక్కు ఎగబీలుస్తోంది]

హలో.

[డాక్టర్ వాలెస్] హాయ్, నా పేరు డాక్టర్ వాలెస్.

మీ వైద్య పరీక్ష ఫలితాలను మీకు తెలియజేయాలి అనుకుంటున్నాను.

మీకు ర్యూమటాయిడ్ అంశం పాజిటివ్ వచ్చింది,

దీని అర్థం ఏమిటంటే ఇది లూపస్ మయోసిటిస్ ర్యూమటాయిడ్ ఓవర్లాప్.

మీకు మేము రిటుక్సాన్ డోస్ మరొకటి ఇస్తాము, అది బహుశా,

మీరు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం బట్టి,

ఒక యేడాది లేదా మరికొంత కాలం మీకు జాయింట్ నొప్పులు పోతాయి.

సరే.

-[డాక్టర్ వాలెస్] సరే, బై. -బై, డాక్టర్ వాలెస్.

-బై. -[డాక్టర్ వాలెస్] బై.

[ముక్కు ఎగబీల్చింది]

[బృందం సభ్యుడు] కనీసం ఇదంతా ఎందుకో కొంతయినా తెలుస్తోంది.

అవును, నాకు… నాకు ఎప్పుడూ జవాబులు తెలిస్తే బాగా అనిపిస్తుంది,

కానీ కిందటిసారి ఆ రిటుక్సాన్ ట్రీట్మెంట్ చాలా కష్టం అనిపించింది, కానీ నేను… నేను…

[జట్టు సభ్యుడు] అది ఏంటి?

రిటుక్సాన్ అనేది ఒక చికిత్స, దానిని నాలోకి ఐవి ద్వారా ఎక్కిస్తారు,

ఇంకా దానికి నాలుగైదు గంటలు సమయం పడుతుంది.

[తడబడుతూ] నా శరీర తత్వానికి అది తట్టుకోవడం చాలా కష్టం, కానీ, హమ్, ఫర్వాలేదు.

[నర్స్] మరేం ఫర్వాలేదు.

నేను రిలాక్స్ కావడానికి నాకు వాళ్లు ఏదో మందు ఇచ్చారు ఎందుకంటే నేను గంటల కొద్దీ అలా స్థిరంగా ఉండలేను.

మా అమ్మమ్మకి రావాలి అనిపించలేదు, ఎందుకంటే ఆమె…

నేను పడే ఈ బాధలన్నీ తను గతంలో చూసింది.

[మింగస్] దానిని నోట్లో పెట్టుకోకు.

[ఉమ్మేస్తోంది]

[గోమెజ్] ఇక్కడ ఎందుకు ఉన్నాను?

ఎందుకు బతికున్నాను?

[మింగస్] అదిగో తనే, బాలెరీనా థంబెలీనా.

[గోమెజ్] స్పష్టంగా దేని కోసమో ఇది.

[మింగస్] ఈ బుజ్జిపిల్ల మొదటి స్నానం. ఈ తడిసిన కుక్కని చూద్దాం.

-[అరుస్తోంది] -[నవ్వుతోంది]

[మింగస్] సరే, ఇప్పుడు నువ్వు స్నానం చేయాలి.

-నోరు మూయి. [నవ్వుతోంది] -[నవ్వుతోంది]

నా స్నేహితుల్ని నేను ప్రేమిస్తాను, నా కుటుంబాన్ని ప్రేమిస్తాను. నేను గొప్ప కూతుర్ని అనుకుంటాను.

నేను గొప్ప స్నేహితురాల్ని అనుకుంటాను. అది నాకు ఎంతో ముఖ్యమైనది.

-ఏం జరుగుతోంది? -[నవ్వుతున్నారు]

కానీ స్పష్టంగా, నేను నాకున్న దానితో మరికొంతమందికి సాయం చేయడం కోసమే

నేను ఇక్కడ ఉన్నానని నాకు తెలుసు.

నన్ను నేను ద్వేషించుకున్నా కూర్చుని, ఫీల్ అయ్యాను

నా హృదయంలో ఒక భాగం ఇంకా కెన్యాలోనే ఉంది,

కానీ కొన్నిసార్లు అక్కడికి వెళ్లినప్పుడు నాకు తప్పు చేశాననే భావన కలిగింది.

నాకు… నాకు తెలియదు, అది నాకు ఇష్టం లేదు.

నేను అక్కడికి వెళ్లాను, అదంతా చిత్రీకరించాను, ఇంకా ఆస్వాదించాను.

కానీ అది చాలా కష్టం అనిపించింది ఎందుకంటే నేను చాలా స్వార్థంగా వ్యవహరించాను.

అవును, అది గొప్పగా సాగింది. ఇంకా, నేను ఏమైనా మార్పుని తీసుకువచ్చానా? తెచ్చాను.

కానీ నేను తగినంత చేయగలిగానా? లేదు.

కెన్యాలో కొందరితో మానసిక ఆరోగ్యం గురించి మాట్లాడినప్పుడు,

అది… [తడబడుతూ] …అందంగా అనిపించింది.

నాకు తెలియదు…

నేను ఇలా అయితే అనుకోలేదు,

“ఓహ్, నేను సాధించాను, ఇంకా నేను చాలా గొప్ప వ్యక్తిని” అని.

అది నాకు ఎలా అనిపించింది అంటే, అది నాకు ఒక ప్రారంభంలాగా అనిపించింది.

అందరికీ హాయ్. నేను సెలీనా గోమెజ్.

ప్రపంచ మానసిక ఆరోగ్య దినోత్సవం సందర్భంగా నేను డాక్టర్ మూర్తిని ఆహ్వానిస్తున్నాను,

ఒంటరితనం గురించి నాతో చాట్ చేయడానికి ఈ సర్జన్ జనరల్ ముందుకొస్తున్నారు

ఇంకా మానసిక ఆరోగ్యం కోసం సహకారాన్ని ఆశించే వారికి ఆయన కొన్ని సదుపాయాలను అందించి సాయం చేస్తున్నారు.

మీరు ఎంతో దయతో నన్ను ఆహ్వానించారు, సెలీనా. మీతో ఈ చర్చ జరపడానికి

నేను చాలా సంతోషిస్తున్నాను.

ఆహ్, కోవిడ్ 19 పరిస్థితిలో మనం ఎదుర్కొంటున్న సమస్యలు ఇప్పటికే పెను సవాళ్లుగా మారాయి

ముఖ్యంగా ఒంటరితనం, డిప్రెషన్ ఇంకా యాంగ్జయిటీ కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి,

ఇంకా కొందరి విషయంలో ఇది మరింత ప్రమాదకరంగా మారడం నాకు ఆందోళన కలిగిస్తోంది.

మనం… మనం మనలోను ఇంకా ఇతురులలో ఒంటరితనాన్ని ఎలా గుర్తించాలి?

ఇంకా ఒంటరితనం లక్షణాలు ఎప్పుడూ ఒంటరిగా ఉండటం లాగే కనిపిస్తాయా?

[డాక్టర్ మూర్తి] అది చెప్పడం చాలా కష్టం.

చాలామంది జనం మధ్య ఉన్నా కూడా, మనం తీవ్రమైన ఒంటరితనం అనుభవించవచ్చు.

అందుకే ఈ ప్రపంచం అంతా అటువంటి భావన ఉన్న మనుషులతో

నిండిపోయింది, కదా?

వాళ్లకి ప్రఖ్యాతి ఉంటుంది, లేదా సంపద ఉంటుంది లేదా పలుకుబడి ఉంటుంది.

కానీ మనకి ఎలాంటి నాణ్యమైన అనుబంధాలు ఉన్నాయనేదే ఇక్కడ ముఖ్యం.

-హమ్…హమ్. -కొందరితో మనం మాట్లాడుతున్నప్పుడు

మనం మనలా ప్రవర్తించలేము అనిపిస్తుంది చూడండి,

అదే మనల్ని ఇతరులతో మరింతగా వేరు చేస్తుంది.

అవును.

ఇం…ఇంకా మనకి ఉన్న ఒంటరితనాన్ని పోగొట్టుకోవాలంటే

సేవాగుణమే అతి గొప్ప చికిత్స.

ఈ ప్రపంచానికి మన విలువని చాటడం ద్వారా మనల్ని మనం గుర్తించడానికి, ఆహ్,

ఇది చాలా అవసరం,

ఇంకా అదంతా కిచెన్ లో వంటలు చేయడానికి వెచ్చించే అవసరం లేదు.

అటువంటి వారి ముందు మనం పూర్తిగా నిలబడి, వారి మాటల్ని శ్రద్ధగా వినాలి.

మనం వాళ్లకి అతి గొప్ప శక్తిమంతమైన అవకాశం ఇచ్చిన వాళ్లం అవుతాం.

హమ్…హమ్. నిజం.

కాబట్టి మనతో మనకి మరింత అనుబంధం పెరగడానికి చేసే ఈ జర్నీ, సెలీనా,

ఇతరులతో కూడా మరింత గాఢంగా అనుబంధాన్ని ఏర్పర్చుకునేలా చేస్తుంది,

ఈ ప్రయాణం మనం ఏమి కామో

అలా మనల్ని మార్చదు.

అంతరాంతరాలలో అసలైన మనం ఏమిటో మన మూలం ఏమిటో

-ఈ ప్రయాణం మనల్ని మళ్లీ అలా మార్చగలుగుతుంది. -వావ్.

…అలా మనం ప్రేమని ఇస్తూ, ప్రేమని స్వీకరిస్తూ మనం మన జీవితానికి గొప్ప అర్థాన్ని కనుక్కోగలుగుతాం

ఇంకా పూర్తి సంతృప్తిని పొందుతాం.

మాటల్లేవ్. నా ఉద్దేశం, మీరు అద్భుతంగా మాట్లాడారు.

సరే.

నాతో పాటు కిందికి వస్తావా? రావా?

“ఈ వాక్యాలు పూర్తి చేయండి.

అపరిచితులు నన్ను ఎలా వర్ణిస్తారు… నా గురించి నాకు మాత్రమే తెలుసు…”

అపరిచితులు నిన్ను ఎలా వర్ణిస్తారు అంటే, ఒక ఆత్మీయమైన అమెరికన్ అమ్మాయి అని.

కానీ జనం చాలా ఆశ్చర్యపోతారు,

ఎందుకంటే నువ్వు ఎంత క్లిష్టమైన దానివో నీకు మాత్రమే తెలుసు.

నీ వ్యక్తిత్వానికి సంబంధించి నీలో చాలా పొరలు ఉన్నాయి.

ఇంకా నీలో చాలా భిన్నమైన కోణాలు కూడా ఉన్నాయి.

ఓహ్.

-ఓహ్, సారీ. -నువ్వు ఏం అంటావు, ఆష్?

అవును, అది గొప్ప సమాధానం అనుకుంటాను.

[నాలుక చప్పరించి] సరే.

“ప్రతి ఒక్కరి జీవితానికి ఒక ప్రయోజనం ఉంటుందని నమ్ముతావా? అలా అయితే, నా ప్రయోజనాన్ని నేను కనుక్కున్నానా?”

అవును, అందరి జీవితాలకీ ఒక ప్రయోజనం ఉంటుందని నేను నమ్ముతాను.

నువ్వు చేయవలసినది ఏదో నీకు తెలుసు అనుకుంటా, కానీ నువ్వు అందులో పాల్గొనడానికి ఎప్పుడూ ఆలోచిస్తావు.

ఒప్పుకుంటాను.

నీ ఉద్దేశం ఏంటి?

నీకు శక్తిని ఇచ్చే పనులు ఏమిటో నీకు తెలుసు,

అవి నీ జీవితానికి సార్థకతని ఇస్తాయి ఇంకా అవి నిన్ను సంతోషంగా ఉంచుతాయి.

కానీ నువ్వు ఎప్పుడూ వాటిని ఎంపిక చేసుకుంటావు అనుకోను.

అవును, అది బహుశా స్వయంకృత అపరాధం.

అవును, అది… అది ఖచ్చితంగా స్వయంకృతమే.

జీవితం సాధారణంగా ఉండటం

-లేదా కల్లోలంగా ఉండటం… -అవును.

వాస్తవానికి అసౌకర్యంగా ఉంటుంది, ఎందుకంటే మనం దాని గురించి ఆలోచిస్తే,

నీ చిన్నతనం నుంచి ఇప్పటి వరకూ నీ సుదీర్ఘమైన జీవితం

ఎప్పుడూ గందరగోళంగానే కనిపిస్తుంది.

-కదా? -అవును.

సరే ఈ మాటల్లో అర్థం ఉంది. అది, అంటే, మరింత సౌకర్యంగా అనిపిస్తోంది.

-అవును, కానీ అది పిచ్చితనం. ఓహ్, అది విసుగ్గా ఉంటుంది. -అవును.

కానీ మంచి విషయం ఏమిటంటే అది నీకు తెలుసు. నిన్ను సంతృప్తిపరిచేవి ఏమిటో నీకు తెలుసు.

-సంతోషంగా ఉంచేదేదో తెలుసు. -[కుక్] తెలివైనదానివి.

నీకు ఏది సంతోషం కలిగించదో కూడా నీకు తెలుసు.

ఆవ్. ఐ లవ్ యూ.

తను అల్లరి తగ్గించింది, కదా?

చాలా గొప్పగా ఉంది. మామూలుగా అయితే చేయి ఊపుతుంది.

-[నవ్వుతోంది] -[కూకూ అంటోంది]

నేను నిన్ను చూస్తున్నాను, ఇంకా నువ్వు నన్ను చూస్తున్నావు.

ఎందుకంటే నేను నీ అమ్మలాగా ఉంటాను.

[ఎగశ్వాస పీలుస్తూ] మా అమ్మని చూడు.

[ఫ్రెండ్] ఓహ్, అయ్య బాబోయ్.

నేను మా అమ్మలా ఉంటానా?

అవును.

-ఏంటి? -[గోమెజ్] ఓహ్, నుదుటి మీద జుట్టు.

తను నా సవతి తండ్రి బ్రయాన్ ని ఎలా పెళ్లి చేసుకుంటోందో చూడు.

-అవును, తను నాకు చాలా గొప్ప తండ్రి. -[మింగస్] ఆహ్.

-అది చాలా ముచ్చటగా ఉంది. ముద్దుగా ఉంది. -[కాస్మి] ఆహ్. అది అద్భుతం.

-సెలీనా? హేయ్. -హాయ్.

-జీవితం ఎలా సాగుతోంది, అమ్మాయి? -[ఫ్రెండ్] బాగుంది, నువ్వు ఎలా ఉన్నావు?

నేను బాగున్నాను.

అవి కరవవు.

హేయ్. [ముద్దాడుతోంది]

ఇది నా ఆఖరి సంతానం.

-తను నా కజిన్ కూతురు. -ఓహ్, దేవుడా.

…ఇంకా నా మిగతా ఇద్దరు పిల్లలు ఇక్కడ లేరు ఎందుకంటే మా అబ్బాయికి లుకేమియా సోకింది.

-ఓహ్, అయ్యో. -దానితో అతను వాళ్ల అమ్మ ఇంట్లో ఉంటున్నాడు,

ఇంకా వాడి చెల్లెలు కూడా వాడితోనే ఉంటానంది.

సరే.

-వాళ్లని అక్కడ ఉంచాం. -[చిన్నపాప బూ అంటోంది]

అది ఏంటి? నన్ను భయపెట్టాలని చూస్తున్నావా?

ఈమె ఎవరో నీకు తెలుసా?

తను సెలీనా గోమెజ్.

నా పేరు సెలీనా.

-ఆమె పాటలు నువ్వు వింటుంటావు కదా? -[నవ్వుతోంది]

-అవును. -[ఎగశ్వాస పీలుస్తోంది]

-[అరుస్తోంది] -[నవ్వుతోంది]

[గోమెజ్ నవ్వుతోంది]

[అరుస్తోంది]

[గోమెజ్ చిన్నగా నవ్వుతోంది]

-[ఫ్రెండ్] తను కొద్దిగా నాటకాలు ఆడుతుంది. -[పాప అరుస్తోంది]

-అవును, అది నేనే. ఆహ్. -[నవ్వుతోంది]

[ఫ్రెండ్] ఇలా రా, బాబా. రావా?

-అవును. నువ్వు మంచి మగాడివి. -తను నిజం అని తెలియదు.

అవును, తను నిజమైనదే.

-మీ అమ్మ తనతో స్కూలుకి వెళ్లింది. -[ఎగశ్వాస]

తను మా వీధి చివర్లోనే ఉండేది.

-[అరుస్తోంది] -అమ్మ తనతో కలిసి పెరిగింది.

నేను ఒక హగ్ ఇవ్వచ్చా?

-[నవ్వుతోంది] -సరే. [నవ్వుతోంది]

నీకు సంతోషంగా ఉందా?

అవును!

[నవ్వుతోంది]

-[గోమెజ్] హలో చెప్పాలి అనుకున్నాను. -సరే, థాంక్యూ. సంతోషం.

-నిన్ను చూడటం ఆనందంగా ఉంది. -అవును. నిన్ను చూడటం కూడా చాలా సంతోషం.

-నీకు అంతా మంచిగా ఉందని సంతోషంగా ఉంది. -అవును.

బాగా మెరుగయ్యావు. నన్ను నమ్ము, ఆ సమయంలో కొద్దిగా భయం వేసేది,

ఎందుకంటే నీతో కలిసి పెరిగాను, నాకు తెలుసు. దాంతో, నువ్వు ఆ బాధలు పడుతుంటే చూసి కష్టం వేసేది.

అవును. థాంక్యూ, నేను ఇప్పుడు బాగానే ఉన్నాను.

ఓహ్, మేమంతా నిన్ను ప్రేమిస్తుంటాము.

-సరే, ఉంటాను, బంగారం. బైబై. -“బైబై” చెప్పు. “థాంక్యూ” చెప్పు.

[గోమెజ్] మనం మానసిక రుగ్మతతో సతమతం అవుతున్నప్పుడు,

ముఖ్యమైన విషయం ఏమిటంటే అది ఏమిటో తెలుసుకోవడం

ఇంకా దానిని గుర్తించడం.

అందుకు నేను సిగ్గుపడను.

నేను పూర్తిగా మర్చిపోయిన చాలా విషయాల్ని నేను మళ్లీ నేర్చుకోవలసి వచ్చింది.

అది… అది ఎలా అనిపిస్తుందంటే, “హేయ్, నువ్వు చెడ్డ వ్యక్తివి కావు.

నువ్వు దారుణమైన మనిషివి కావు.

నువ్వు పిచ్చిదానివి కావు. నువ్వు వీటిలో ఏవీ కావు

కానీ నువ్వు దీనితో పోరాడక తప్పదు.

అది చాలా కష్టం అని నాకు తెలుసు, కానీ అదే వాస్తవం.”

ఇంకా నేను తెలుసుకున్నది ఏమిటంటే బైపోలార్ తో నాకు ఉన్న అనుబంధం, అది…

అది నాతో ఉంటుంది.

దానిని ఇప్పుడు నేను నా ఫ్రెండ్ ని చేసుకున్నాను.

నేను నేనుగా ఉండాలంటే దానిని భరించక తప్పదు,

ఇంకా నేను దానితో పోరాడుతునే ఉంటాను,

కానీ నేను నిజంగా సంతోషంగా ఉన్నాను.

నేను హాయిగా ఉన్నాను.

నేను కోపంగా ఉన్నాను.

నేను విచారంతో ఉన్నాను.

నేను ఆత్మవిశ్వాసంతో ఉన్నాను.

నేను చాలా సందిగ్ధంలో ఉన్నాను.

నేను వర్క్ ఇన్ ప్రోగ్రెస్ లో ఉన్నాను.

నేను సంపూర్ణంగా ఉన్నాను.

నేను సెలీనాని.

సెలీనా గోమెజ్ 2020లో రేర్ ఇంపాక్ట్ ఫండ్ ఏర్పాటు చేసింది

వంద మిలియన్ డాలర్లు సేకరించాలన్నది తన లక్ష్యం

యువతీయువకులకు ఉచిత మానసిక ఆరోగ్య సదుపాయాలు

కల్పించడమే తన ఉద్దేశం

మే 2022న, సెలీనా ఇంకా రేర్ ఇంపాక్ట్ ఫండ్ కలిసి

మానసిక ఆరోగ్యం గురించి మొట్టమొదటి యూత్ యాక్షన్ ఫోరమ్ ని

వైట్ హౌస్ సహకారంతో నిర్వహించారు.

సెలీనా అమెరికా అధ్యక్షుడిని కలుసుకుని దేశంలోని పాఠశాలల్లో

మానసిక ఆరోగ్యాన్ని పాఠ్యాంశంగా చేర్చడం గురించి చర్చించింది.

మీరు గనుక అమెరికాలో ఉండి మీకు తక్షణం సహాయం కావాలి అంటే

దయచేసి 988 నెంబరుకి కాల్ చేయండి లేదా సందేశం పంపండి

సుశిక్షితులైన కౌన్సెలర్లు మీకు అందుబాటులో ఉంటారు

మీరు గనుక అమెరికా వెలుపల దేశాలలో ఉంటే

దయచేసి యాపిల్ డాట్ కామ్/ హియర్ టు హెల్ప్ అనే వెబ్ సైట్ లోకి వెళ్లి అంతర్జాతీయ హెల్ప్ లైన్లలో సంప్రదించండి.

-[నిర్మాత] మమ్మల్ని ఈ రోజు ఆహ్వానించినందుకు థాంక్యూ. -[గోమెజ్] అవును.

ఇదంతా నేను స్వచ్ఛమైన మనసుతో చేస్తున్నాననే విషయం

అందరికీ అర్థం కావాలని కోరుకుంటున్నాను,

నా భావాల్ని మీరు రికార్డుల ద్వారా వ్యాప్తి చేయాలని నా కోరిక.

నేను ఇదివరకు ఎప్పుడూ ఇలా చేయలేదు. మీరు చేశారా?

-లేదు, నేను… అవును. -డైరీ రాతలు, జర్నల్ రాతలు?

-లేదు, మరీ వ్యక్తిగతంగా ఉంది. -[రెండవ ప్రొడ్యూసర్] అవును.

[మొదటి ప్రొడ్యూసర్] మీ జర్నల్ ఎంట్రీలని మేం పాడుచేయనందుకు సంతోషిస్తున్నా.

-[అందరూ నవ్వారు] -లేదు, మీరు చేయలేదు.

తెలుగు అనువాదం: సతీశ్ కుమార్

As an Amazon Associate I earn from qualifying purchases 🛒
తో నిర్మించారు (ノ◕ヮ◕)ノ🪄💞💖🥰 across the gl🌍🌏🌎be