వీడియో
ట్రాన్స్క్రిప్ట్
2019 డిసెంబర్‌లో చైనా అధికారులు
వారి దేశం లోని వివిధ ప్రదేశలలోని ప్రజల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతోందని ప్రపంచానికి తెలియజేసారు
తరువాతి నెలల్లో, ఇది ఇతర దేశాలకు వ్యాపించింది, ఈ కొన్ని కేసులు రోజుల్లో రెట్టింపు అయ్యాయి.
ఈ వైరస్ తీవ్రమైన పేరు శ్వాసకోశ సిండ్రోమ్-సంబంధ మైన కరోనావైరస్ 2
ఇది కోవిడ్-19 అనే వ్యాధిని కలుగజేస్తుంది మరియు దీనిని కరోన వైరస్ అని పిలుస్తారు
ఇది మానవుడికి సోకినప్పుడు అసలు ఏమి జరుగుతుంది మరియు మనమందరం ఏమి చేయాలి?
[పరిచయ సంగీతం]
ఒక వైరస్ నిజంగా జన్యు పదార్ధం మరియు కొన్ని ప్రోటీన్ల చుట్టుకొని ఉన్నఒక పదార్దం, ఇది నిస్సందేహంగా ఒక జీవి కూడా కాదు.
ఇది ఒక జీవన కణంలోకి ప్రవేశించడం ద్వారా మాత్రమే ఎక్కువగా వ్యాపించగలదు
కరోనా ఉపరితలాల ద్వారా వ్యాపించవచ్చు,
కానీ అది వాటిపై ఎంతకాలం జీవించగలదో ఇప్పటికీ అనిశ్చితంగా ఉంది.
దీని వ్యాప్తికి ప్రధాన మార్గం ప్రజలు దగ్గుతున్నప్పుడు వచ్చే తుంపర్లు, లేదా మీరు అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని తాకి తర్వాత మీ ముఖాన్ని తాకడం ద్వార అంటుతుంది
కళ్ళు లేదా ముక్కు రుద్దడం లాంటివి చేయడం
ఈ వైరస్ ఇక్కడ తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుంది, మరియు తరువాత శరీరంలో మరింత లోతుగా వెళ్తుంది
దీని గమ్యస్థానాలు పేగులు, ప్లీహము లేదా ఊపిరితిత్తులు, ఇక్కడ ఇది చాలా నాటకీయ ప్రభావాన్ని చూపుతుంది.
కొన్ని కరోనా వైరస్లు కూడా చాలా నాటకీయ పరిస్థితిని కలిగిస్తాయి.
మన ఊపిరితిత్తులు బిలియన్ల ఎపిథీలియల్ కణాలతో కప్పబడి ఉంటాయి.
ఈ ఊపిరితిత్తులలోని కాణాలు మరియు శ్లేష్మం మీ శరీర అవయవాలకు వైరస్ సోకకుండా చుట్టూ ఉన్నఒక రక్షణ సరిహద్దు పొర లేదా వలయం.
కరోనా వైరస్ దాని జన్యు పదార్థాన్నిఈ రక్షణ పొరలపై ఒక నిర్దిష్ట గ్రాహకంతో కలుపుతుంది.
కానీ ఈ రక్షణ పొరలలో ఉన్న సెల్స్-కు, ఏమి జరుగుతుందో తెలియదు, ఇవి కరోనా వైరస్ యొక్క క్రొత్త సూచనలను అమలు చేస్తాయి, ఇవి చాలా సరళంగా ఉంటాయి:
వైరస్ మిగతా సెల్స్ కు కాపీ అయ్యి, అవి తిరిగి కలుస్తాయి
అక్కడ ఉన్న మరిన్ని కణాలు వైరస్ ద్వారా ఇంజెక్ట్ చేయబడి ఒక క్లిష్టమైన దశకు చేరుకుంటాయి, ఈ దశలో ఇవి వైరస్ యొక్క చివరి సందేశాన్నిపొందుతాయి
అదే స్వీయ వినాశనం.
ఆ కణo పగిలిపోయి మరిన్నిదాడి చేయడానికి సిద్ధంగా ఉండే కొత్త కణాలను విడుదల చేస్తుంది
వైరస్ సోకిన కణాల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది
సుమారు 10 రోజుల తరువాత, మిలియన్ల శరీర కణాలకు వైరస్ సంక్రమిస్తుంది మరియు బిలియన్ల వైరస్లు మన ఊపిరితిత్తులను నింపేస్తాయి
ఇప్పటి వరకు వైరస్ వల్ల మరీ ఎక్కువ నష్టం కలిగించదు, కానీ దీని తర్వాత కరోనా ఇప్పుడు మీపై నిజమైన మృగాన్ని విడుదల చేయబోతోంది,
మీ స్వంత రోగనిరోధక వ్యవస్థ.
మీ రోగనిరోధక వ్యవస్థ, మిమ్మల్ని రక్షించడానికి అక్కడ ఉన్నప్పుడు, వాస్తవానికి మీరే చాలా ప్రమాదకరమైన పరిస్తితిలో ఉంటారు మరియు మన యొక్క రోగనిరోధక వ్యవస్తను నియమ్తృంచడం చాలా చాలా కస్టమైపోతుంది
మరియు వైరస్ పై పోరాడటానికి ఊపిరితిత్తులలోనికి వచ్చిన కొన్ని రోగనిరోధక కణాలలొ కొన్నింటికి కరోనా సోకుతుంది మరియు గందరగోళాన్ని సృష్టిస్తుంది.
కానీ కణాలకు చెవులు లేదా కళ్ళు లేవు.
మన రోగనిరోధక కణాలు సైటోకిన్స్ అనే చిన్న సమాచార ప్రోటీన్ల ద్వారా ఎక్కువగా ఏర్పడతాయి
దాదాపు ప్రతి ముఖ్యమైన రోగనిరోధక ప్రతిచర్య వాటిచే నియంత్రించబడుతుంది.
కరోనా సోకిన రోగనిరోధక కణాలు అతిగా స్పందించడానికి మరియు అవి శరీరంలోని మిగతా కణాలను చంపుతాయి
ఒక రకంగా చెప్పాలంటే, ఇది రోగనిరోధక శక్తిని పోరాట ఉన్మాదంలోకి నెడుతుంది మరియు అవసరమైన దాని కంటే ఎక్కువ మంది సైనికులను(రోగనిరోధక కణాలను) పంపుతుంది, శరీర వనరులను వృధా చేస్తుంది తద్వారా నష్టాన్ని కలిగిస్తుంది.
ముఖ్యంగా రెండు రకాల రోగనిరోధక కణాలు ఈ వినాశనానికి కరణమవుతాయి
మొదటివి న్యూట్రోఫిల్స్, ఇవి మన కణాలతో సహా మిగతవాటిని చంపడంలో గొప్పవి.
ఇవి వేలాదిగ చేరుకున్నప్పుడు, అక్కడ శత్రుకణాలతొ పాటు మిత్రాకణాలను నాశనం చేసే ఎంజైమ్‌లను బయటకు పంపడం ప్రారంభిస్తాయి.
ఉన్మాదంలోకి వెళ్ళే ఇతర ముఖ్యమైన కణాలు కిల్లర్ టి-కణాలు, ఇవి సాధారణంగా వైరస్ సోకిన కణాలను నియంత్రిత ఆత్మహత్యకు ఆదేశిస్తాయి.
గందరగోళంలో ఉన్న మన రోగనిరోధక కణాలు ఆరోగ్యకరమైన కణాలను చంపడానికి ఆదేశాలు ఇవ్వడం ప్రారంభిస్తాయి
ఎన్ని ఎక్కువ రోగనిరోధక కణాలు వస్తే అవి అంత ఎక్కువ నష్టం కలిగిస్తాయి మరియు ఆరోగ్యకరమైన ఊపిరితిత్తుల కణజాలాలను చంపేస్తాయి.
ఇది ఎంత ప్రమదకరంగ మారుతుంది అంటే కొన్ని సార్లు శాశ్వతమైన కోలుకోలేని నష్టాన్ని కలిగిస్తుంది, మరియు జీవితకాల వైకల్యాలకు దారితీస్తుంది.
చాలా సందర్భాలలో, రోగనిరోధక వ్యవస్థ నెమ్మదిగా నియంత్రణను తిరిగి పొందుతుంది.
వ్యాధి సోకిన కణాలను చంపుతుంది, క్రొత్త వాటికి సోకడానికి ప్రయత్నిస్తున్న వైరస్లను అడ్డుకుంటుంది మరియు యుద్ధభూమిని శుభ్రపరుస్తుంది.
రోగి కోలుకోవడం ప్రారంభమవుతుంది.
కరోనా బారిన పడిన వారిలో ఎక్కువ మంది తేలికపాటి లక్షణాలతో ఉంటారు.
కానీ చాలా కేసులు తీవ్రంగా లేదా క్లిష్టంగా మారుతాయి.
ఎంత శాతం కరోనా కేసులు తీవ్రంగా లేదా క్లిష్టంగా మారతాయి తెలియదు ఎందుకంటే అన్ని కేసులు గుర్తించబడటంలేదు
కానీ ఫ్లూతో పోలిస్తే చాలా ఎక్కువ ఉందని చెప్పడం సురక్షితం. మరింత తీవ్రమైన సందర్భాల్లో,
మిలియన్ల ఎపిథీలియల్ కణాలు చనిపోయాయి మరియు వాటితో ఊపిరితిత్తుల మరియు అవయవాలకున్న రక్షణ లైనింగ్ లేదా పొర నసనమై చిరుగుతుంది
మరియు ఊపిరితిత్తులో ఉన్న అల్వియోలీ అనే - శ్వాస తీసుకొనే చిన్న గాలి సంచులు, సాధారణంగా పెద్ద సమస్య లేని బ్యాక్టీరియా బారిన పడతాయి.
రోగులకు న్యుమోనియా వస్తుంది.
శ్వాసక్రియ కష్టమవుతుంది లేదా విఫలమవుతుంది, మరియు రోగులు జీవించడానికి వెంటిలేటర్లు అవసరమవుతాయి
రోగనిరోధక వ్యవస్థ వారాల పాటు పూర్తి సామర్థ్యంతో పోరాడి లక్షలాది యాంటీవైరల్ ఆయుధాలను తయారు చేస్తుంది
కానీ వేలాది బ్యాక్టీరియా కణాలు వేగంగా వృద్దిచెండంతో మన రోగనిరోధక వ్యవస్త ఏమిచేయలేకపోతుంది
ఈ బాక్టీరియా కణాలు రక్తంలోకి ప్రవేశించి శరీరాన్నిఎంతోఎక్కువగా నిపేస్తాయి ; ఇది జరిగితే, మరణం సంభవించే అవకాశం చాలా ఎక్కువగా వుంటుంది
కరోనా వైరస్ తరచుగా ఫ్లూతో పోల్చబడుతుంది, కానీ వాస్తవానికి, ఇది చాలా ప్రమాదకరమైనది.
కరోన న మహమ్మారి చాలా ఎక్కువగా ఉన్న ఈ సమయంలో ఖచ్చితమైన మరణాల రేటు చెప్పడం కష్టం,
ఇది అత్యంత త్వరగా వ్యాపించే అంటువ్యాధి మరియు ఫ్లూ కంటే ఇది వేగంగా వ్యాపిస్తుందని ఖచ్చితంగా చెప్పగలం.
కరోనా వంటి మహమ్మారికి భవిష్యత్తులో రెండు విధాలుగా వ్యాప్తి చెందవచ్చు ఒకటి వేగంగా లేదా రెండు నెమ్మదిగా.
వ్యాప్తి ప్రారంభ రోజుల్లో మనమందరం ఎలా స్పందిస్తామో దానిపై మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
కరోనా మహమ్మారి వేగవంతంగా వ్యాప్తి చెందితే దీని పర్యవసానం చాలా భయంకరంగా ఉంటుంది మరియు చాలా మంది ప్రాణాలను కోల్పోతారు
నెమ్మదిగా ఈ మహమ్మారి వ్యాప్తి చెందితే దీనివలన పెద్ద నష్టం వుండదు, చరిత్ర పుస్తకాలకి ఇది గుర్తుండదు.
పైన చెప్పిన విధంగా భయానకమైన వేగవంతమైన విధంగా వైరస్ మొదలైతే సంక్రమణ రేటు కూడా చాలా వేగంగా వుండి ప్రారంభమవుతుంది
ఎందుకంటే వ్యాప్తి వేగాన్నితగ్గించడానికి నివారణ చర్యలు లేవు కాబట్టి
ఇది ఎందుకు అంత చెడ్డది?
వేగవంతమైన కరోన మహమ్మారిలో, చాలా మంది ఒకే సమయంలో అనారోగ్యానికి గురవుతారు.
ఒకవేళ చాలా ఎక్కువమందికి వ్యాధి సోకితే , ఆరోగ్య సంరక్షణ వ్యవస్థ మీద ఎక్కువ భారంపడి వ్యాధిని నివారణ చర్యలు నిర్వహించలేకపోతాయి
ప్రతి ఒక్కరికీ సహాయపడటానికి వైద్య సిబ్బంది లేదా వెంటిలేటర్లు వంటి పరికరాలు వంటి వనరులు తగినంత ఉండవు.
ప్రజలు చికిత్స దొరక్క చనిపోతారు.
మరియు ఎక్కువ మంది ఆరోగ్య సంరక్షణ కార్మికులు తమను తాము అనారోగ్యానికి గురిచేసుకొంటారు, ఆరోగ్య సంరక్షణ వ్యవస్థల సామర్థ్యం మరింత పడిపోతుంది.
ఇదే జరిగితే, ఎవరు జీవించాలి, ఎవరు జీవించకూడదు అనే దానిపై భయంకరమైన నిర్ణయాలు తీసుకోవలసి ఉంటుంది.
అటువంటి సందర్భంలో మరణాల సంఖ్య గణనీయంగా పెరుగుతుంది.
దీన్ని నివారించడానికి, ప్రపంచం - అంటే మనమందరం - దీన్ని నెమ్మదిగా విస్తరించే మహమ్మారిగా మార్చడానికి ఏమి చేయాలో అది చేయాలి.
సరైన ప్రతిస్పందనల ద్వారా ఈ మహమ్మారి విస్తరించే వేగం తగ్గుతుంది
ముఖ్యంగా ప్రారంభ దశలో,మనం సరిగ్గా ప్రతిస్పందిస్తే అనారోగ్యానికి గురైన ప్రతి ఒక్కరూ చికిత్స పొందవచ్చు మరియు అత్యధికమైన రోగులతో ఆసుపత్రులు నిండిపోయి ఏమిచెయ్యలేని పరిస్తితిరాదు.
కరోనాకు ఎటువంటి వ్యాక్సిన్ టీకా లేనందున, మనం స్పందించే ప్రవర్తనను సామాజికంగా అందరు అవలంభించేట్టు చేయాలి,
అంటే మనమే సామాజిక వ్యాక్సిన్ లాగా పనిచేయడం. దీనికి అర్థం రెండు విషయాలు:
- వ్యాధి బారిన పడకుండా ఉండటం; మరియు 2. ఇతరులకు ఇది అంటించకుండ ఉండటం.
ఇది చిన్నవిషయం అనిపించినప్పటికీ, మీరు చేయగలిగే గొప్పపని మీ చేతులు కడుక్కోవడం.
సబ్బు నిజానికి శక్తివంతమైన సాధనం.
కరోనా వైరస్ ప్రాథమికంగా కొవ్వు పొర లోపల ఉంటుంది;
సబ్బు ఆ కొవ్వును విచ్ఛిన్నం చేస్తుంది మరియు వైరస్ మీకు సోకకుండా చేస్తుంది.
ఇది మీ చేతులను జారుడుగా చేస్తుంది, మరియు చేతులు కడుక్కోవటం వంటి యాంత్రిక కదలికలతో, వైరస్లు తీసివేయబడతాయి.
ఇది ఎలా అంటే, మిరపకాయలని పట్టుకొని కేదా కాంటాక్ట్ లెన్స్ కళ్ళలో పెట్టుకోడానికి ముందు చేతులు కడుక్కోవడం లాగా.
తదుపరి విషయం సామాజిక దూరం, ఇది మంచి అనుభవం కాకపోయినప్పటికి,
ఇది మంచి పని. దీని అర్థం: కౌగిలించుకోకుండ వుండటం, కరచాలనం చేయకుండా ఉండటం.
మీరు ఇంట్లో ఉండగలిగితే, సమాజం పనిచేయడానికి అవసరమైన వారిని రక్షించడానికి ఇంట్లో ఉండండి:
వైద్యుల నుండి క్యాషియర్లు వరకు లేదా పోలీసు అధికారుల వరకు; మీరు అందరు వారిపై ఆధారపడతారు; వారందరూ అనారోగ్యంగా ఉండకుండా వుండటం మీ మీద ఆధారపడి ఉంటుంది.
కొంచెం ముందుకెళ్లి ఆలోచిస్తే, కొన్ని దిగ్బంధలు ఉండొచ్చు, అంటే ప్రయాణ పరిమితులు, మనకు మనమే గృహ నిర్బంధంలో ఉండటం.
నిర్బంధాలు అనుభవించడానికి గొప్పవి కావు మరియు ఖచ్చితంగా జనాదరణ పొందవు.
కానీ అవి మన పరిశోధకులకు మందులు మరియు వాక్సిన్లు కనిపెట్టే కీలక సమయం ఇస్తాయి
కాబట్టి మీరు నిర్బంధంలో వున్నట్లైతే, మీరు ఎందుకు ఉన్నారో అర్థం చేసుకోవాలి మరియు దానిని గౌరవించాలి.
ఇవేవీ సరదా విషయాలు కావు. కానీ మనం ఒక పెద్ద చిత్రాన్ని చూస్తే, ఇది మనం చెల్లించాల్సిన చిన్నధర.
ఈ మహమ్మారి ఎలా ముగుస్తుంది అనే ప్రశ్న, అవి ఎలా ప్రారంభమవుతాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది;
ఇవి ఒకవేళ ఎంతో వేగంగా ప్రారంభమైతే, అవి అంతే ఘోరంగా ముగుస్తాయి.
ఇవి ఒకవేళ నెమ్మదిగా ప్రారంభమైతే, అంతే నెమ్మదిగా, సరేలే అన్నట్టు ముగుస్తాయి.
మరియు, ఈ రోజు మరియు ఈ తరంలో, ఇది నిజంగా మన చేతుల్లోనే ఉంది.
సాహిత్యపరంగా, మరియు
అలంకారంగా.
ఇంత చిన్న సమయంలో ఈ వీడియో చెయ్యడానికి మనకు సహకరిచిన నిపుణులకు ఎంతో గొప్ప ధన్యవాదాలు తెలుపుతున్నాం,
ప్రత్యేకంగా మన ప్రపంచ డేటాకి,
ప్రపంచంలోని అతిపెద్ద సమస్యలపై చేసే పరిశోధనలు మరియు వాటి సమాచారం ఇచ్చే ఆన్‌లైన్ ప్రచురణలకు
మరియు వాటిని పరిష్కరించడంలో పురోగతి ఎలా సాధించాలి తెలిపే వారికి.
వారి సైట్ చూడండి. ఇది కరోనా మహమ్మారిపై నిరంతరం నవీకరించబడిన ఒక పేజీని కూడా కలిగి ఉంటుంది
[ముగింపు సంగీతం]